Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Kejriwal accuses PM Modi for his biased attitude during Chief Ministers meet

By   /  July 21, 2016  /  Comments Off on Kejriwal accuses PM Modi for his biased attitude during Chief Ministers meet

    Print       Email

modi-mathuraమోడీ ఎందుక‌లా చేస్తున్నారు?

 

InCorpTaxAct
Suvidha

 

 

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను స‌రిగా చూడ‌డం లేదా? ప‌క్ష‌ప‌తంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అంటే అవున‌నే అంటున్నారు ఢిల్లీ ఆప్ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌. తాను సాక్షాధారాల‌తో స‌హా నిరూపిస్తాన‌ని కూడా అంటున్నారు. మొన్న‌ ఢిల్లీలో ప్రధాని నేతృత్వంలో ముఖ్యమంత్రుల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. సజావుగా సాగినట్లుగా కనిపించిన ఈ అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో బయటకు రాని కొన్ని వాస్త‌వాల‌ను బ‌య‌టకు తీశారు అరవింద్ కేజ్రీవాల్. ఈ సమావేశం గురించి తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ సమావేశానికి హాజరైన కొందరు ముఖ్యమంత్రుల మొబైల్ ఫోన్లను సమావేశానికి అనుమతించలేదని ఆయన ఆరోపిస్తున్నారు. అంతే కాదు మరికొందరు ప్రతిపక్ష ముఖ్యమంత్రుల గళం వినిపించకూడదని కేంద్రం భావించిందని ఆరోపించారు. అన్నింటికి మించి.. మొబైల్ ఫోన్ల విషయంలోనే మోడీ సర్కారు విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉందని చెబుతున్నారు.

కొందరు ముఖ్యమంత్రులకు మొబైల్ ఫోన్లతో అనుమతించి.. మరికొందరి విషయంలో మాత్రం వదిలేయటం ఏమిటన్న మాట ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఈ వ్యవహారంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యను చూస్తే.. ‘‘అంతరాష్ట్ర మండలి సమావేశంలో నాతో సహా మరికొందరు ముఖ్యమంత్రులు తమ మొబైల్ ఫోన్లను బయటే వదిలి వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో.. మమతా బెనర్జీ లాంటి వారిని మాత్రం మొబైల్ ఫోన్లతో అనుమతించారు. సీఎంలతో మోడీకి ఏమైనా ముప్పు ఉందా? ఈ ప్రశ్నే నేను అడిగితే నా స్పీచ్ కు అడ్డంకులు ఎదురయ్యాయి. మొబైల్ ఫోన్ తో అనుమతించిన మమతా బెనర్జీని సమావేశంలో ఆమెను మాట్లాడనివ్వలేదు. ప్రతిపక్ష ముఖ్యమంత్రుల గళం వినిపించకూడదని కేంద్రం భావిస్తే.. ఈ మీటింగ్ కు మమ్మల్ని ఎందుకు ఆహ్వానించినట్లు?’’ అంటూ కేజ్రీవాల్ అడుగుతున్న ప్రశ్నలకు బీజేపీ స‌మాధానం చెప్పుకోలేని ప‌రిస్థితి. కాగా మోడీ అలా వ్య‌వ‌హ‌రించ‌డం త‌ప్పేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల వాద‌న.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →