కేజ్రీవాల్ బ్యాంకు ఎకౌంట్ డీటెయిల్స్ ఇప్పించండి: కేజ్రీవాల్
కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య వివాదం తారాస్థాయికి చేరుతోంది. ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా అరుణ్ జైట్లీ అవినీతికి పాల్పడ్డారని ఆ మధ్య కేజ్రీవాల్ ఆరోపించిన విషయం తెలిసిందే.దీంతో ఆయనపై అరుణ్ జైట్లీ పరువునష్టం దావా కేసు వేశారు. ప్రస్తుతం ఈ కేసుపై ఢిల్లీ సిటీ కోర్టులో విచారణ జరుగుతోంది. మరోవైపు.. తనపై పరువునష్టం కేసు విచారణ జరుగుతుంటే.. కేజ్రీవాల్ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
అరుణ్ జైట్లీ అవినీతి భాగోతం బయటపెడతానని అంటున్నారు. దీనికోసం జైట్లీ బ్యాంక్ అకౌంట్ డీటైల్స్ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు.అరుణ్ జైట్లీతో పాటు ఆయన కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్ల వివరాలు అడిగారు. అలాగే.. పది శాతం కంటే ఎక్కువ షేర్లున్న కంపెనీల ఖాతాల వివరాలు కూడా తెలియజేయాలని కేజ్రీవాల్ కోరారు. అరుణ్ జైట్లీ అవినీతిపై తాను చేసిన ఆరోపణలకు బ్యాంక్ అకౌంట్లే తగిన ఆధారాలని ఆయన భావిస్తున్నారు. బ్యాంక్ స్టేట్ మెంట్లను పరిశీలిస్తే జైట్లీ బాగోతం బట్టబయలు అవుతుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే అసలు పరువునష్టం దావా కేసు మరుగున పడుతుందనేది కేజ్రీవాల్ ఆలోచనగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.