Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Kerala CM Oommen Chandy: Declare Kollam temple fire a national calamity

By   /  April 13, 2016  /  Comments Off on Kerala CM Oommen Chandy: Declare Kollam temple fire a national calamity

    Print       Email

chandyకొల్లం ఘ‌ట‌న‌ను జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించండి

 

InCorpTaxAct
Suvidha

 

కేర‌ళ రాష్ట్రంలోని కొల్లం జిల్లా ప‌ర‌వూర్ గ్రామంలోని పుట్టింగళ్‌దేవి ఆలయంలో పూజ‌ల అనంత‌రం పేల్చిన బాణా సంచా ప్ర‌మాద ఘ‌ట‌న‌లో దాదాపు 110 మందికి పైగా చ‌నిపోయి తీవ్ర న‌ష్టం జ‌రిగింద‌ని, దీనిని జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించాల‌ని కేర‌ళ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వూమెన్ చాంధీ బుధ‌వారం కేంద్రాన్నికోరారు. కొల్లం ఘ‌ట‌న‌పై చ‌ర్చించేందుకు కేబినెట్ స‌మావేశం ఏర్పాటు చేసి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ముఖ్య‌మంత్రి చెప్పారు. బాణ సంచా వేడుక‌ల‌పై గురువారం అఖిల‌పక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. బాణసంచా వేడుకలపై అందరి అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటామన్నారు.
కొల్లం ఘటనపై త్వరలోనే విచారణ చేపట్టి. నిందితులను తప్పకుండా శిక్షిస్తామని చాందీ అన్నారు. కొన్ని పార్టీల వారు ఈ ఘటనను రాజకీయం చేస్తున్నారని, అది సరికాదని అన్నారు. విపత్తుల సమయంలో అందరం కలిసి పని చేసి బాధితులను ఆదుకోవాలని కోరారు. కాగా కొల్లం జిల్లా ప‌ర‌వూర్ గ్రామంలో ఉన్న అమ్మ‌వారి ఆల‌యంలో దాదాపు 100 సంవ‌త్స‌రాల చ‌రిత్ర గ‌లిగిన ఆల‌యం. పూజ‌ల అనంత‌రం బాణ‌సంచా పేల్చ‌డం కార‌ణంగా ఆ నిప్పుర‌వ్వ‌లు బాణ‌సంచా నిలువ ఉన్న ఇంటిపైప‌డ‌డంతో ఈ ప్ర‌మ‌దం చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఏది ఏమైనా ఇలాంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్య‌త ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌పై ఉంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →