సోషల్ మీడియాలో కేరళ రాజకీయ నాయకుల ప్రచారం..
కేరళలో ఎన్నికల ప్రచారం వినూత్నంగా నిర్వహిస్తున్నారు. సీనియర్.. జూనియర్ అని తేడా లేకుండా మొత్తం రాజకీయ నాయకులు సోషల్ మీడియా ద్వారా ముమ్మర ప్రచారం చేపడుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలోనే ఎక్కువగా ప్రచారం నిర్వహిస్తున్నారు. యువతకు ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా గేలం వేస్తున్నారు. అయితే కేరళలో ఒకప్పటిలా భారీ మైకులు , బహిరంగ సభలు అంతగా నిర్వహించడం లేదు. ఎక్కువగా సోషల్ మీడియా హవానే నడుస్తోంది. ఫేస్బుక్, ట్విట్టర్ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తాము గతంలో చేసిన సేవా కార్యక్రమాలను వర్ణిస్తూ పోస్టులు పెడుతూ ప్రచారంలో నిమగ్నమైపోయారు. తామను గెలిపిస్తే తమ జీవితం ప్రజా సేవకు అంకితం అంటూ సందేశాలతో ఊదరగొడుతున్నారు.
సోషల్ మీడియా ప్రచారం కోసం యువ ఇంజనీర్లు, టెక్నీషియన్లను కేరళ రాజకీయ పార్టీలు అపాయింట్ చేసుకుంటున్నాయి. ఇక ఈ ప్రచారంలో కమలనాథులు ఓ అడుగు ముందే ఉన్నారు. ముఖ్యంగా తమ ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేసే బాధ్యతను ఆ పార్టీ నెటిజన్లకే అప్పగించింది. అలాగే సీపీఎం, కాంగ్రెస్ కూడా ఫేస్ బుక్‌ను ఫుల్ గా వాడుకుంటున్నాయి. కేరళ సీఎం ఊమెన్ చాంది ఫేస్ బుక్‌లో లైవ్ షోలు ఇస్తున్నారు. ప్రచారం కోసం వాట్స్ప్ను సైతం ఫుల్ గా వాడేసుకుంటున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.