Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Kishan Reddy Fires On CM KCR..

By   /  March 5, 2016  /  Comments Off on Kishan Reddy Fires On CM KCR..

    Print       Email

kishan reddy 2

సీఎం కేసీఆర్ పై కిషన్ రెడ్డి విమర్శలు..

InCorpTaxAct
Suvidha

ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అమరావతికి ఏపీ రాజధాని తరలిపోతే.. హైదరాబాద్‌లో వారు ఉపయోగిస్తున్న అసెంబ్లీ, సచివాలయం, ఇతర భవనాలన్నీ తెలంగాణ ప్రభుత్వం అధీనంలోకి వస్తాయనయనారు. మనకు అవసరానికి మించి భవనాలున్నాయన్నారు. కొత్తగా అసెంబ్లీ, సెక్రటేరియట్ కట్టడం అవసరమా..? అంటూ విమర్శించారు. సీఎం, మంత్రులు, ఐఏఎస్ లకు కొత్త భవనాలు దేనికని మండిపడ్డారు.

బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త అసెంబ్లీ, సచివాలయం, సీఎం, మంత్రులు, ఐఏఎ్‌సల భవనాలకు.. ప్రభుత్వం చెబుతున్నట్లుగా రూ. 900 కోట్లు సరిపోవన్నారు. ఇంచుమించుగా రూ. 3 వేల కోట్ల వరకూ ఖర్చవుతుందన్నారు. బెస్ట్‌ లివింగ్‌ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌కు సీఎం కేసీఆర్‌ నిర్ణయాలతో తీరని నష్టం కలుగుతోందన్నారు. టీడీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్‌ నోటీసులు ఇవ్వడంపై కూడా కిషన్ రెడ్డి స్పందించారు. ఆ చర్యలను ఉత్తుత్తి చర్యలుగా అభివర్ణించారు. కేవలం అవి తూతూ మంత్రం నోటీసులేనన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →