చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి: కొడాలి నాని, పెద్దిరెడ్డి
రీసెంట్ గా నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడుతున్నారు. చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి అని విమర్శిస్తున్నారు. తెలంగాణలో ఓ మాట.. ఏపీలో మరో మాట మాట్లాడుతున్నారని ఎమ్మెల్యేలు కొడాలినాని, పెద్దిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబుకు నైతిక విలువలు లేవన్నారు. విజయవాడలో జరిగిన వైసీపీ నేతల భేటీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , కొడాలి నాని పాల్గొన్నారు.
చంద్రబాబుకు దమ్ముంటే పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్ చేశారు. మళ్లీ ఎన్నికలకు వెళ్లి గెలవాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై తాము గవర్నర్, స్పీకర్ కు ఫిర్యాదు చేయబోమన్నారు. స్పీకర్ కు ఫిర్యాదు చేసినా ఏ మాత్రం ప్రయోజనం ఉండబోదని అభిప్రాయపడ్డారు. పదవులు, డబ్బును ఎరగావేసి తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనేయడం, క్యాంపు రాజకీయాలు నడిపించడం చంద్రబాబుకు అలవాటేనని వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. వచ్చే నెల 6న విజయవాడలో వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని ఆ పార్టీ నేతలు కొడాలి నాని, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి తెలిపారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.