Loading...
You are here:  Home  >  Deccan Abroad  >  Current Article

Kodandaram criticizes KCR

By   /  December 16, 2016  /  Comments Off on Kodandaram criticizes KCR

    Print       Email

kodandaramకేసీఆర్ తీరును త‌ప్పుబ‌ట్టిన కోదండ‌రాం

 

InCorpTaxAct
Suvidha

 

 

* ప్ర‌జాభిప్రాయం లేకుండా బిల్లులపై నిర్ణ‌యాలు వ‌ద్దు

* ప్రైవేట్ వ‌ర్సీటీలు రావ‌డం మంచిదికాదు

* ఈనెల 19న స‌భాప‌క్ష నాయ‌కుల‌తో రౌండ్ టేబుల్ స‌మావేశం

* టీజేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం వ్యాఖ్య‌లు

తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావుపై మ‌రోసారి ఫైర్ అయ్యారు తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం. నిర్వాసితులకు న్యాయం చేయడం కోసం సర్కారు రూపొందించిన కొత్త భూసేకరణ బిల్లుపైనా విస్తృతంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. జిల్లాల పునర్‌విభజన బిల్లును కూడా సభలో ఆమోదించాలని కేబినెట్‌లో తీర్మానం చేశారని గుర్తుచేశారు. ప్రజలు కోరుకున్న విధంగా న్యాయం జరిగేందుకు అన్ని పార్టీల శాసన సభాపక్ష నాయకులతో ఈ నెల 19న రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ రంగంలోనే అందరికీ మంచి విద్య లభిస్తుందన్న కోదండరాం.. ప్రైవేటు వర్సిటీల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వ వ్యవస్థలతోనే ప్రజల్లో అసమానతలు తొలగుతాయని చెప్పారు. సామాజిక అంతరాలుపెరిగే అవకాశం ఉన్నందున ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయొద్దన్నారు. పెద్ద నోట్ల రద్దుతో రైతుల పరిస్థితి గందరగోళంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. సుధీర్‌ కమిటీ నివేదిక బాగుందని, దాన్ని అమలుపై సభలో చర్చించాలని అన్నారు.

డీఎస్సీలు వేయటంలేదన్న కారణంతో బీఈడీ, డీఈడీ అడ్మిషన్లు ఆపడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కళాశాలల యాజమాన్యాలు చేస్తున్న ఆందోళనకు టీజేఏసీ నుంచి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తెలంగాణ జేఏసీ ఏర్పాటై 7 వసంతాలు పూర్తవుతున్న సందర్భం గా ఆవిర్భావ దినాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఆ వివరాలను జేఏసీ సమన్వయకర్త పిట్టల రవిందర్‌ మీడియాకు వెల్లడించారు. తెలంగాణ పునరంకిత దీక్ష పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. జేఏసీ స్టీరింగ్‌ కమిటీ విస్తృత స్థాయి సమావేశం 25న నిర్వహిస్తామని ప్రకటించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →