Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Kolkatta knight riders victory in IPL match..

By   /  April 18, 2017  /  Comments Off on Kolkatta knight riders victory in IPL match..

    Print       Email

kolkatta knight ridersకోల్ కతా నైటర్ రైడర్స్ విజయం..

 

InCorpTaxAct
Suvidha

 

 

ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ టీమ్ పెద్ద పోరాటమే చేసింది. తొలుతగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు సంజూ శాంసన్‌ (39), శామ్‌ బిల్లింగ్స్‌ (21) బాగానే ఆడారు. తర్వాత కరుణ్‌ నాయర్‌ (21), శ్రేయస్‌ అయ్యర్‌ (26) కూడా ఆకట్టుకున్నారు. అయితే రిషబ్‌ పంత్‌ (38) స్కోర్ బోర్డ్ ను వేగంగా పరిగెత్తించాడు.ఇక క్రిస్‌ మోరిస్‌ (16) కూడా చెలరేగడంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 రన్స్ చేసింది.
తర్వాత బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ కి ఢిల్లీ డేర్ డెవిల్స్ గట్టి షాక్ ఇచ్చింది.మొదటి రెండు ఓవర్లలోనే గ్రాండ్ హోం (1), కెప్టెన్ గౌతమ్ గంభీర్ (14) ను ఔట్ చేశారు. అలాగే ఊతప్పను పెవిలియన్ కు పంపించారు.తర్వాత వచ్చిన యూసుఫ్ పఠాన్ (59), మనీష్ పాండే (69) హాప్ సెంచరీలతో అదరొగొట్టారు.కాని సూర్యకుమార్ యాదవ్ మాత్రం నిరాశపరిచాడు. అయితే వోక్స్ (2) పర్వాలేదనిపించాడు.

మ్యాచ్ చివరకు వచ్చే సరికి ఢిల్లీ డేర్ డెవిల్స్ బౌలర్లు అద్భుతంగా బంతులు వేశారు. దీంతో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మారిపోయింది.అయితే లాస్ట్ ఓవర్ ని అమిత్ మిశ్రా బాగా వేశాడు.ఫస్ట్ బాల్ ని డాట్ బాల్ గా వేశాడు. తర్వాతి బంతితో వోక్స్ (3) ను అవుట్ చేశాడు. మూడో బంతికి సునీల్ నరైన్ (1) సింగిల్ రన్ రాబట్టాడు. నెక్ట్స్ బాల్ ని మాత్రం మనీష్ పాండే సిక్సర్ గా మలిచాడు. ఆ తర్వాతి బాల్ కి రెండు రన్స్ తీశారు. దీంతో లాస్ట్ బాల్ మిగిలి ఉండగానే కోల్ కతా నైట్ రైడర్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా మనీష్ పాండేను ఎంపిక చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →