కోమటిరెడ్డి అందుకే టీఆర్ఎస్లో చేరలేదా?
తెలంగాణలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గతంలో నల్గొండను శాశించిన నాయకుడు. దివంగత వైయస్ఆర్ హయాంలో జిల్లాను ఏలిన వ్యక్తి కోమటిరెడ్డి. అలాంటి వ్యక్తి ఉన్నట్లుండి టీఆర్ఎస్లో చేరుతున్నారని వార్తలు గుప్పమన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోను, మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌తోనూ మంతనాలు అయిపోయాయని, టీఆర్ఎస్లో చేరడమే తరువాయి అని అంతా అనుకున్నారు కూడా. అంతేలోనే కోమటిరెడ్డి టీఆర్ఎస్కు ట్విస్ట్ ఇచ్చారు. తాను టీఆర్ఎస్లో చేరుతున్నానని ఎవరు చెప్పారంటూ మీడియాను ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను విమర్శించినంత మాత్రానా పార్టీని వీడి ఎందుకు వెళ్తామని అంటున్నారు. అయితే కోమటిరెడ్డి టీఆర్ఎస్లోకి వెళ్లకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయని, మేధావులు, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కోమటిరెడ్డిపై అంత సానుకూలంగా లేరని, ఆయన అడిగిన మంత్రి పదవిని ఇస్తానని హామీ ఇవ్వకపోవడం వల్లనే కోమటి రెడ్డి టీఆర్ఎస్లోచేరకుండా వెనక్కి తగ్గారని విశ్వసనీయ సమాచారం. కేసీఆర్ తో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయన్న మాటతో జరిగే ప్రయోజనం ఎంతన్నది కోమటిరెడ్డి బద్రర్స్ కు తెలియంది కాదు. అలా అని.. ఎలాంటి పదవుల హామీల లేకుండా పార్టీ చేరితే ఎలాంటి ప్రయోజనం ఉండదని.. అంతకు మించి ఉన్న పార్టీలోనే కొనసాగితే ఎంతోకొంత ప్రయోజనం ఉంటుందన్న భావన కోమటిరెడ్డి బ్రదర్స్ లో వ్యక్తం కావటంతో వారు కారు ఎక్కే కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు కనిపిస్తోంది. కొంత కాలానికి అయినా కోమటి రెడ్డి బ్రదర్స్ టీఆర్ఎస్లో చేరుతారా? లేదా? అన్నది తెలియాలంటే మరికొంత కాలం ఆగక తప్పదు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.