Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Komati Reddy Venkata Reddy joining TRS!

By   /  June 7, 2016  /  Comments Off on Komati Reddy Venkata Reddy joining TRS!

    Print       Email

komatireddyకోమ‌టిరెడ్డి అందుకే టీఆర్ఎస్‌లో చేర‌లేదా?

 

InCorpTaxAct
Suvidha

 

న‌ల్గొండ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తార‌క‌రామావుతో మంత‌నాలు చేశార‌ని, మంత్రి హ‌రీశ్ రావుతో కూడా చ‌ర్చ‌లు జ‌రిపార‌ని, టీఆర్ఎస్‌లో 6వ తేదీ చేరుతున్నార‌ని వార్త‌లు పుంకానుపుంకాలుగా వ‌చ్చాయి. కానీ 6వ తేదీ దాటిపోయినా ఆయ‌న టీఆర్ఎస్‌లో చేర‌లేదు. కాంగ్రెస్ పై ఘాటు విమర్శలు చేసిన కోమటిరెడ్డి ఎందుకు అధికార పార్టీలో చేర‌డం లేదో ఎవ‌రికీ అంతుప‌ట్ట‌డంలేదు. అయితే కొంత‌మంది మాత్రం కోమ‌టిరెడ్డి చేర‌క‌పోవ‌డానికి కార‌ణం జిల్లాల విభ‌జ‌న‌నే అంటున్నారు . జిల్లాల విభజన అనంతరమే టీఆర్ ఎస్ లో చేరితే బాగుంటుందన్న అభిప్రాయానికి కోమటిరెడ్డి వచ్చారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

నల్లగొండ – సూర్యాపేట జిల్లాలుగా అయితే నల్లగొండ జిల్లా తన నాయకత్వంలోకి వస్తుందనేది కోమటిరెడ్డి బ్రదర్స్ ఆలోచనగా ఉందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఆగిపోయినట్లు సమాచారం. దీంతోపాటుగా తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి సీటు కోసమే వెంకటరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలిసింది. రాజగోపాల్ రెడ్డి కోసం మునుగోడు సీటును అడిగినట్టు సమాచారం. దీనిపై త్వరలో ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ సైతం ఇదే కారణంతో వేచిచూస్తున్నారని సమాచారం. గద్వాల జిల్లా కోసం ఆమె పట్టుపడుతున్నారనీ ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదని చర్చ నడుస్తోంది. కాగా పూర్తి క్లారిటీతో పార్టీలో చేరితో భ‌విష్య‌త్‌లో ఎలాంటి ఇబ్బందులుఉండ‌వ‌ని ఆ నాయ‌కులు భావించి ఉంటార‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →