Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Komatireddy responded to the news that he will join in BJP

By   /  September 13, 2017  /  Comments Off on Komatireddy responded to the news that he will join in BJP

    Print       Email

బీజేపీలో చేరుతారనే వార్తలపై స్పందించిన కోమటిరెడ్డి

 

EIS
EnGeniusInc

 

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై రీసెంట్ గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కాషాయం కండువా కప్పుకోబోతున్నారని ప్రచారం సాగుతోంది. ఇవాళో రేపో కమలం గూటికి చేరుతారని రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ప్రచారాలపై ఆయన స్పందించారు. తనకు పార్టీ మారే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ లోనే ఉండి కావల్సిన వాటి గురించి కొట్లాడుతామని తేల్చేశారు. కేవలం మీటింగులు పెట్టుకుంటే పార్టీని గెలిపించలేరని అన్నారు. జనంలోకి వెళ్తేనే గుర్తింపు వస్తుందన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీకి సరైన రిజల్ట్స్ రావడం లేదని మరోసారి ఆరోపించారు. ఆయన్ను తక్షణం పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.

కనీసం తమకు పీసీసీ పదవిని ఏడాది పాటు ఇవ్వాలని కోరారు. లేదంటే తెలంగాణ కోసం ఉద్యమించిన వారికి ఎవరికి ఇచ్చినా పర్వాలేదన్నారు.ఏ లీడర్ హాయంలో పార్టీకి పూర్వ వైభవం వస్తుందో హై కమాండ్ గుర్తించాలని అన్నారు. ఉత్తమ్ కుమార్ పీసీసీ చీఫ్ గా ఉంటే తాను వచ్చే ఎన్నికల్లో కనీసం పోటీ కూడా చేయనని చెప్పేశారు.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct
    Print       Email

You might also like...

TATA – (Telangana American Telugu Association) – Bathukamma and Dussara sambaralu

Read More →