Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Komatireddy, Sampath expelled from TS Assembly And 11 MLAs suspended for session

By   /  March 13, 2018  /  Comments Off on Komatireddy, Sampath expelled from TS Assembly And 11 MLAs suspended for session

    Print       Email

కోమ‌టి రెడ్డి.. సంప‌త్‌ల శాస‌న స‌భ్య‌త్వం ర‌ద్దు

Suvidha
Biryani Pot

 

 

 

* మ‌రో 11 మంది కూడా స‌స్పెండ్‌
* ప్ర‌తిప‌క్షం లేకుండానే బ‌డ్జెట్ స‌మావేశాలు
* దూకుడుగా నిర్ణ‌యం తీసుకున్న అధికార పార్టీ
డెక్క‌న్ అబ్రాడ్‌: తెలంగాణ అసెంబ్లీలో సోమవారం జరిగిన ఘటనను సర్కార్ సీరియస్ తీసుకుంది. గవర్నర్ ప్రసంగిస్తున్న సందర్భంగా తెలంగాణకాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుసరించిన వైఖరిని తీవ్రంగా తప్పు పట్టింది. అందులో భాగంగా అసెంబ్లీలో అనుచితంగా వ్య‌వ‌హ‌రించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు వేశారు. సభలో అవాంఛనీయ ఘటనలకు పాల్పడిన 11 మంది కాంగ్రెస్ నేతల్ని ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేసినట్లుగా శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. అదే సమయంలో.. మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌పై హెడ్ ఫోన్స్ విసిరిన ఉదంతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సంపత్ ల శాసనసభా సభ్యత్వాల్ని రద్దు చేస్తున్నట్లుగా వెల్లడించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌పై స‌స్పెష‌న్ వేటు జానారెడ్డి, జీవన్ రెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, డీకే అరుణ, మల్లు భట్టి విక్రమార్క, పద్మావతి రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, వంశీచందర్ రెడ్డి, మాధవరెడ్డిలను సస్పెండ్ చేస్తూ మంత్రి హరీశ్ రావు ప్రవేశ పెట్టిన తీర్మానానికి తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి ఆమోద ముద్ర వేశారు. దీంతో.. తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Sankaranethralaya fundraiser event ksheera Saagara Madhanam is a grand success!!

Read More →