Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

KomatiReddy says it is TRS drama, Swamy Goud is not injured!

By   /  March 12, 2018  /  Comments Off on KomatiReddy says it is TRS drama, Swamy Goud is not injured!

    Print       Email

బ‌స్తీమే స‌వాల్‌!

Suvidha
Biryani Pot

 

 

 

 

* స్వామిగౌడ్‌కు గాయం కాలేదు.. అదంతా టీఆర్ఎస్ డ్రామా

* గాయ‌మైన‌ట్లు రుజువు చేస్తే ప‌ద‌వికి రాజీనామా చేస్తే

* బ‌హిరంగ క్ష‌మాప‌ణ కూడా అడుగుతా

* మీడియా స‌మావేశంలో కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి

డెక్క‌న్ అబ్రాడ్‌: “ మండ‌లి చైర్మ‌న్ స్వామిగౌడ్‌కు ఎలాంటి గాయం కాలేదు. తెలంగాణ ప్ర‌భుత్వం ప‌నే. స్వామిగౌడ్‌కు గాయం అయిందని రుజువు చేస్తే నా ప‌ద‌వికి రాజీనామా చేస్తే అంతేకాదు.. బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ అడుగుతా“ అని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి తెలంగాణ ప్ర‌భుత్వానికి స‌వాల్ విసిరారు.  కేసీఆర్ తనను బలి ఇవ్వాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అందరికి టార్గెట్ తానేనని వ్యాఖ్యానించారు. `మా జిల్లాలో రెడ్లు – సెటిలర్స్ ఎక్కువ. కేసీఆర్ నల్గొండ నుండి పోటీచేస్తే నేను ఇంట్లో కూర్చున్నా గెలుస్తాను. రెడ్లు ఎవరు టీఆర్ ఎస్ కు ఓటు వేయరు. ఈసారి నాయినికి కూడా రెడ్లు ఓటు వేసే చాన్స్ లేదు` అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ నుండి పోటీచేయాలని కోరితే తాను రెడీ అని కోమటిరెడ్డి ప్రకటించారు. గజ్వేల్ లో కేసీఆర్ కంటే తనకే ఎక్కువ బంధువులు ఉన్నారని ఆయన వివరించారు.

మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయమైందంటూ ప్రభుత్వం ఓ డ్రామా నడుపుతోందని కాంగ్రెస్ కోమటిరెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. గాయమైనట్లు దృశ్యాల ద్వారా రుజువు చేస్తే బేషరతుగా క్షమాపణ చెప్పి తన రాజీనామా సమర్పిస్తానని మ‌రోమారు స్పష్టంచేశారు. 17 నిమిషాల తర్వాత వీల్‌ఛైర్‌లో కూర్చోబెట్టి గాయమైందని చెబుతున్నారని ఆరోపించారు. గవర్నర్‌ ప్రసంగంలో దేనిపైనా స్పష్టతలేదని మండిపడ్డారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TANA will not let criminals run our well earned reputation, Satish Vemana

Read More →