Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Kona Venkat, Prabhudeva join hands for a bilingual..

By   /  April 1, 2016  /  Comments Off on Kona Venkat, Prabhudeva join hands for a bilingual..

    Print       Email

prabhu deva - kona venkat

ప్రభుదేవాకు కోనా వెంకట్ సలహాలు..?

InCorpTaxAct
Suvidha

 

 

కోనా వెంకట్ రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత ఆయన నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. అయితే ఆ రంగంలో బాగా నిలదొక్కుకోలేకపోయినా .. సినిమా టైటిల్స్ విషయంలో మాత్రం బాగా సక్సెస్ అయిపోయాడు. టైటిల్ , సినిమా పోస్టర్ అదిరిపోయేలా ఆయన చేయగలడు. అయితే ప్రేక్షకుల్ని థియేటర్ లో కట్టిపడేయాలంటే మాత్రం ఒరిజినల్ గా కథలో పట్టుఉండాలి. అయితే ఈ విషయంలో దెబ్బతిన్న కోనా వెంకట్ టైటిల్ విషయంలో తన రూటే సెపరేటు అన్నట్లు ఉన్నాడు.

అలాగే.. డాన్స్‌మాస్టర్ టర్నడ్ యాక్టర్ టర్న్ డ్ డైరెక్టర్ ప్రభుదేవ రీసెంట్ గా నిర్మాతగా కూడా అవతరించారు. ఏకంగా ఒకే సమయంలో ఐదు సినిమాలను ప్రారంభించారు. దీంతో ఆయన పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది.ప్రస్తుతం ప్రభుదేవా.. తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ డైరెక్షన్ లో ఓ సినిమా మొదలెట్టారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నిర్మితమవుతున్న ఈ సినిమాని ఎమ్‌.వి.వి సత్యనారాయణతో కలిసి తెలుగులోకి కూడా తీసుకొస్తున్నారు.

తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి తెలుగులో ‘అభినేత్రి’ అనే టైటిల్‌ను సెలక్ట్ చేశారు. ప్రభుదేవ, సోనూ సూద్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.ముందుగా ఈ సినిమాకి తనదైన శైలిలో ‘పాతాళ బైరవి’ అనే టైటిల్‌ చెప్పారట కోనా వెంకట్. అయితే ఇది మూడు భాషల్లో నిర్మించే చిత్రం కాబట్టి చివరకు అభినేత్రి అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రానికి థమన్, జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించనున్నారు. ఇదిలాఉండగా.. తమన్నా కూడా ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ లోకి అడుగుపెట్టేసినట్లు అయింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →