కొండ గాలి తిరిగిందీ..

సినిమా-ఉయ్యాల జంపాల(1965)
సంగీత సారధ్యం: పెండ్యాల
రచన : ఆరుద్ర
గానం– : గాన గంధర్వుడు ఘంటసాల, సుశీలమ్మ
ఈ సినిమాలో అన్ని పాటలను ఆరుద్ర గారే రాసారు ,అన్నీ బాగుంటాయి!
*******
కొండగాలి తిరిగిందీ..
కొండగాలి తిరిగింది.. గుండె ఊసులాడింది..
గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది..
పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికిందీ..
పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికింది..
గట్టుమీద కన్నెలేడి గంతులేసి ఆడింది..
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది..
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది..
పట్టరాని లేత వలపు పరవశించి పాడింది..
కొండగాలి తిరిగింది.. గుండె ఊసులాడింది..
గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది..
మొగలిపూల వాసనతో జగతి మురిసిపోయింది..
మొగలిపూల వాసనతో జగతి మురిసిపోయింది..
నాగమల్లి పూలతో నల్లని జడ నవ్వింది..
పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది..
పడుచుదనం ఆందానికి తాంబూలమిచ్చింది..
ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది..
కొండగాలి తిరిగింది .. గుండె ఊసులాడింది
గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది..
ఈ పాటను ఇక్కడ https://www.youtube.com/watch?v=g-B5nAbSzQ4 వినండి!
టీవీయస్.శాస్త్రి

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.