బాలయ్య వందో సినిమాకు సంగీత దర్శకుడు ఇతనే..?
పలు సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్న కారణంగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ బాలయ్య వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ నుంచి తప్పుకున్నారు. దీంతో సినిమా దర్శకుడు క్రిష్, బాలకృష్ణ తమ సినిమాకు మరో సంగీత దర్శకుడిని వెతికేపనిలో పడ్డారు. ఇందులో భాగంగా పలువురు సంగీత దర్శకులను పరిశీలించారు.
మ్యూజిక్ డైరెక్టర్ గా ఇళయరాజాను గాని, ఎంఎం కీరవాణీని గాని తీసుకోవాలని భావించారు. వీరిద్దరూ చారిత్రక నేపథ్యమున్న చిత్రాలకు సంగీతం అందించడంలో దిట్ట. అయితే వారివురు కూడా బిజీగానే ఉన్నారు. దీంతో మరో దర్శకుడిని ఫైనల్ చేశారట క్రిష్. కంచె సినిమాకు సూపర్ మ్యూజిక్ అందించిన చిరంతన్ భట్ ను ఎంపిక చేశారని సమాచారం. దీనికి భట్ కూడా అంగీకారం తెలిపారని టాక్. ఇప్పటికే బాలయ్య సినిమా 40 శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. బాలయ్య తల్లిగా ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలిని, భార్యగా శ్రియ నటిస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.