పుష్కరాలు… దుఃఖ సాగరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పుష్కరాలు కలిసి వచ్చినట్లు కనిపించడం లేదు. టీడీపీ సర్కార్కు పుష్కరాలు చేదు జ్ఞాపకాలను మిగిలిస్తున్నాయి. పుష్కరాలను బ్రహ్మాండంగా నిర్వహించాలనుకుంటున్నారు.. ఏదోఒక అపశృతి జరిగి చెడ్డపేరు తెస్తోంది. గోదావరి పుష్కరాల్లో మొదటి రోజు తొక్కిసలాట కారణంగా 29 మంది చనిపోయిన సంఘటనను ఇంకా మరువకముందే కృష్ణా పుష్కరాల్లో మొన్నటి మొన్న ఒక పసిపిల్లవాడు, నిన్న ఒక పూజారి, నేడు ఐదు మంది విద్యార్థులు దుర్మారణం చెందారు. వివరాల్లోకి వెళ్లితే… కష్ణా జిల్లా నందిగామలో చైతన్య కళాశాలలో బి.కాం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యా ర్థులు మంగళవారం పుష్కరస్నానంకు అని కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు రేవు నుండి ఒక పడవ మాట్లాడుకొని గుంటూరు జిల్లా అమరావతి మం డలం దిడుగు రేవుకు చేరుకున్నారు. ఈత కోసం లోతుగా వున్న ప్రాంతంలో దిగ టంతో శ్వాస అందక కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం తోటరావులపాడుకు చెం దిన హరీష్, నందిగామ మండలం చెరుకుంపాలెంకు చెందిన జ్యోతిరెడ్డి, నంది గామ వాసులు లోకేష్, హరిజ్యోతిలు అక్కడికక్కడే మతి చెందారు. ఆరుగురు ప్రాణాలతో బయటపడి ఒడ్డుకు చేరుకున్నారు. మునిగిపోయిన ప్రాంతంలో 30 అడుగులకు పైగా లోతులో ఇసుక తవ్వడం, పులిచింతల ప్రాజెక్టు నుండి పుష్కరస్నానాల కోసం 10,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో ఆ విషయం తెలియని విద్యార్థులు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. అక్రమంగా ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా ఇసుకాసురులు తవ్వడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు వాపోతున్నారు.
ఇదిలా వుండగా, కష్ణాజిల్లా సూపరింటెండెంట్ విజయకుమార్ ప్రమాదస్థలికి చేరుకొని మీడియాతో మాట్లాడుతూ లోతు ఎక్కువగా వున్న ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు పెట్టడం జరిగిందని, అయినా విద్యార్థులు వాటిని భేఖాతరు చేస్తూ వెళ్లారని, ప్రమాదానికి ఎవరూ బాధ్యులు కాదని అనడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మరోవైపు మంగళవారం అమరావతి పుష్కరఘాట్లను పరిశీలించడానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కూతవేటు దూరంలో వున్నా సంఘటన జరిగిందని తెలిసి కూడా తనకేమి తెలియదన్నట్లు వ్యవహరించడం చాలా బాధాకరమని పలువురు వాపోతున్నారు. ప్రాణాలతో బయటపడిన విద్యార్థులు మాట్లాడుతూ గజ ఈతగాళ్లు సకాలంలో ప్రమాదస్థలికి వచ్చినప్పటికీ లోతులో దిగలేమని చేతులెత్తేశారని, వారు చొరవ చూపిస్తే తమ స్నేహితులు బ్రతికేవారని ఒక విద్యార్థి కన్నీరు పర్యంతమయ్యారు. దీనిని బట్టి చూస్తే ఈత వచ్చినవారిని అధికారులు ఘాట్ల వద్ద నియమించలేదని తెలుస్తోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.