Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

krishna pushkaralu started by veda pandits

By   /  August 13, 2016  /  Comments Off on krishna pushkaralu started by veda pandits

    Print       Email

krishnapusknewchadrababuవేడుక‌గా కృష్ణా పుష్క‌రాలు ప్రారంభం

 

InCorpTaxAct
Suvidha

 

 

తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్క‌రాలు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. వేద ప‌డింతుల మంత్రోచ్ఛ‌ర‌ణ‌ల మ‌ధ్య కృష్ణ‌మ్మ‌కు హార‌తి ఇచ్చి పుష్క‌రాల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంతో పాటు కుటుంబ స‌భ్యుల‌తో పుష్క‌ర స్నానాలు ఆచ‌రించారు. ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం 5.45కు, తెలంగాణలో ఉదయం 5.58 నిమిషాలకు ప్రారంభ‌మైన ఈ పుష్క‌రాలు  పన్నెండు రోజుల  పాటు కొనసాగనున్నాయి. తెలంగాణలో పుష్కరాలకు మామూలుగా ఏర్పాట్లు చేయగా..ఆంధ్రప్రదేశ్ సర్కారు మాత్రం హంగామా చేస్తోంది. విజయవాడలో కృష్ణా బ్యారేజ్ దగ్గర గోదావరి పుష్కరాల సమయంలో చేసినట్లు  ‘ఫుష్కర హారతి’ కూడా  ఏర్పాటు చేస్తోంది. అంతే కాదు..సాంస్కృతిక కార్యక్రమాలు..ఉచిత అన్నదానాలు , ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పన్నెండళ్లకొక్కసారి వచ్చే ఈ పుష్కరాలకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎంతో ఉంటుంది. పుష్కరకాలంలో నదుల్లో త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలూ, సప్తరుషులు, పితృదేవతలూ నివసిస్తారని… మూడున్నర కోట్ల తీర్థాలు అందులో కలుస్తాయని విశ్వసిస్తారు.

అందుకే ఈ కాలంలో పుష్కర స్నానం, పితృ కర్మలు అనంత పుణ్యప్రదమని భావిస్తారు. దేశంలో మూడో పెద్ద నదిగా, దక్షిణాదిన గోదావరి తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించే కృష్ణానది పడమటి కనుమల్లోని మహాబలేశ్వర్ సమీపాన ఒక చిన్నధారగా ప్రారంభమవుతుందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ముందుకు సాగు తున్నకొద్దీ అది అనేక ఉప నదులను సంగమించుకుంటూ, తాను ఒరుసుకు ప్రవహించే నేలతల్లిని సశ్యశ్యామలం చేసుకుంటూ సుమారు 1,240 కిలోమీటర్లు ప్రయాణించి ఆంధ్రప్రదేశ్‌లోని హంసలదీవి వద్ద బంగాళాఖాతాన్ని చేరుతుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో 29 నదులు కృష్ణమ్మలో లీనమవుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1,188 మీటర్ల వెడల్పుతో దీని విశ్వ రూపం కనబడుతుంది.  ఈసారి పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో మూడున్నర కోట్లమంది… తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో మరో మూడున్నర కోట్లమంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →