Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

KTR clarified KCR’s comments on Modi

By   /  March 2, 2018  /  Comments Off on KTR clarified KCR’s comments on Modi

    Print       Email

మోడీని అంత‌మాట అంటారా?

InCorpTaxAct
Suvidha

 

 

 

 

 

* కేసీఆర్ వ్యాఖ్య‌ల‌పై కేంద్రం సీరియ‌స్‌

* వివ‌ర‌ణ ఇచ్చినా త‌గ్గ‌ని బీజేపీ

* మోడీ త‌ప్పులు మాట్లాడ‌లేదా? అంటూ ఎంపీ క‌విత కౌంట‌ర్ ఎటాక్‌

డెక్క‌న్ అబ్రాడ్‌: ఒక్కోసారి అనుకోకుండా, పొర‌పాటున‌ మాట్లాడిన మాట‌లు ఇత‌రుల‌ను చాలా బాధ‌పెడ‌తాయి. అందుకే మాట్లాడే ముందు జాగ్ర‌త్త‌గా మాట్లాడాలి అంటారు. మొన్నీమ‌ధ్య తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు ఓ స‌భ‌లో దేశ ప్ర‌ధానినుద్ధేశించి మాట్లాడుతూ “మోడిగాడికి“ అన్నారు. అది ఏ ఉద్దేశ్యంతో అన్నారో తెలియ‌దు కానీ.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌న‌డుస్తోంది. కేసీఆర్ వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ బీజేపీ నేత‌లు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతుంటే కేంద్ర‌మంత్రులు కూడా కేసీఆర్ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌డుతున్నారు. కేసీఆర్ స్పందించి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు కేంద్రంలో బీజేపీ నేతలు కేసీఆర్‌పై కన్నెర్రజేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటికి సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్ ఇచ్చినా వాళ్లు శాంతించ‌డం లేద‌ని తెలిసింది.

తాజాగా కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీని అవమానించాలనే సంకుచిత ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. మోదీపై వ్యాఖ్యలు కేవలం మాటల్లో దొర్లిన తప్పిదమేనని ఆమె వివరణ ఇచ్చారు. కేసీఆర్.. మోదీని ఉద్దేశ్యపూర్వకంగా అనలేదని, మాట్లాడుతుండగా ఫ్లోలో అలా అన్నారని చెప్పారు. చిన్న పొరపాటుపై బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదీ దావోస్ పర్యటనలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కవిత గుర్తు చేశారు. “600 కోట్ల మంది తనకు ఓటేశారని దావోస్‌లో మోదీ అన్నార‌ని, దేశంలో ఉండేది 130 కోట్ల మందేన‌ని గుర్తు చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →