Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

KTR gives cash reward to worker Venkayya

By   /  August 5, 2016  /  Comments Off on KTR gives cash reward to worker Venkayya

    Print       Email

KTRఉత్త‌మ కార్మికుడికి కేటీఆర్ న‌గ‌దు

 

InCorpTaxAct
Suvidha

 

రాష్ట్ర పరిశ్రమలు, ఐటి, మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరో సారి మనసున్న మారాజు అని నిరూపించుకున్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ పారిశుద్ధ్య కార్మికుడిగా జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న వెంకటయ్య ఎంపిక్కై, రాష్ట్రానికి గుర్తింపు తెచ్చిన సంద‌ర్భంగా వెంకటయ్యకు మంత్రి కేటీఆర్ రూ.1,11,111నగదుతో పాటు శాలువా కప్పి సన్మానించారు. స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా జాతీయ స్థాయిలో ఇద్దరు కార్మికులను ఎంపిచచేయగా వీరిలో జీహెచ్ఎంసీ రాజేందర్‌నగర్ సర్కిల్‌కు చెందిన పారిశుద్ద్య కార్మికుడు వెంకటయ్యకు అవార్డు లభించింది. వెంకటయ్యకు లభించిన పురస్కారానికి స్పందించిన మంత్రి కేటీఆర్ స్వంతంగా రూ.1,11,111రూపాయల చెక్కును వెంకటయ్యకు అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. దీనితో పాటు జీహెచ్ఎంసీ నుంచి రూ.లక్ష చెక్కును అందజేశారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్, కమిషనర్ డాక్టర్ బి.జనార్థన్‌రెడ్డిల సమక్షంలో సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి కేటీఆర్ అవార్డుకు ఎంపికైన వెంకటయ్యను ఘనంగా సన్మానించారు.
దేశం మొత్తంలో కేంద్ర పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ కేవలం ఇద్దరు కార్మికులను ఉత్తమ అవార్డులకు ఎంపిక చేసిది. వీరిలో జీహెచ్ఎంసీకి చెందిన వెంకటయ్య ఒకరు ఉండటం అభినందనీయమని కేటీఆర్ అన్నారు. వెంకటయ్యను తన కార్యాలయానికి పిలిపించుకుని మంత్రి అప్యాయంగా మాట్లాడారు. ఎన్నేళ్లకు పనిలో చేరావు, సెలవులు తీసుకోకుండా పనిచేస్తున్న తీరుపట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంకటయ్య కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీలో అవార్డు తీసుకునేందుకు వెలుతున్న వెంకటయ్యకు అన్ని ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను కోరారు. తన పరిధిలోని రోడ్లను పరిశుభ్రంగా ఉంచకుంటే తనకు నిద్రకూడ రాదని, అందుకే ప్రతిరోజు గత 16ఏళ్లుగా ఒక్కరోజు కూడా సెలవు లేకుండా పనిచేస్తున్నట్లు మంత్రికి వెంకటయ్య తెలిపారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →