Loading...
You are here:  Home  >  Deccan Abroad  >  Current Article

వెంకటాచలం భాగవతార్ మహదేవన్ గారి 98 వ పుట్టిన రోజు సందర్భంగా నివాళి.

By   /  March 14, 2016  /  No Comments

    Print       Email
KV

సినీ సంగీత గగనాన చంద “మామ” , కోటి రాగాల “కోయిలమ్మ” ను  తన పేరులోనే పొదుముకున్న మామ కృష్ణన్‌”కోయిల్” వెంకటాచలం భాగవతార్ మహదేవన్ గారి  98 వ పుట్టిన రోజు సందర్భంగా నివాళి.
మావ మావ మావ, గోదారి గట్టుంది, సిత్రాలు సేయరో శివుడో శివుడా వంటి జానపదులైనా
 నవ్వు వచ్చిందటే కిల కిల ,గోరంత దీపం కొండంత వెలుగు వంటి భావ గర్భిత గీతాలైనా , నెమలికి నేర్పిన నడకలివి, ఝుమ్మంది నాదం, అఖిలాండేశ్వరి చాముండేశ్వరి  వంటి నృత్య ప్రధాన గీతాలైనా , నిన్ను మరచి పోవాలని అన్ని విడిచి వెళ్ళాలని, నేనొక ప్రేమపిపాసిని, చేరేదేటకో తెలిసీ చేరువ కాలేమని తెలిసి  వంటి వేదనా భరిత విరహ గీతాలు, ఓంకార నాదాను, సామజ వరగమనా, ఆనతి నీయరా వంటి శాస్త్రీయ  సంగీత ప్రధాన గీతాలు ,మన జన్మభూమి బంగారు భూమి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ,ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే వంటి దేశభక్తి గీతాలైనా,  దంచవే మేనత్త కూతురా, కో కో కో కో కో కోతి కొమ్మచ్చి తీపి అప్పచ్చి, అల్లిబిల్లి అమ్మాయి అంద చందాలున్నాయి వంటి హుషారైన పాటలైనా , నీ కళ్ళు చూశాను కళ్ళలో మన ఇల్లు చూశాను  , వందనాలు వందనాలు వలపుల హరి చందనాలు , చీర లెత్తు కెళ్ళాడా చిన్ని కృష్ణుడు చిత్తమే దోచాడీ చిలిపికృష్ణుడు , ఎంతో రసికుడు దేవుడు, ఏ గీత గీసినా నీ రూపమే, నవ్వులు రువ్వే పువ్వమ్మా నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా, సిన్ని ఓ సిన్ని ఓ సన్నజాజుల సిన్ని,  రాళ్ళల్లో ఇసకల్లో, కోరుకున్నాను నిన్నే చేరుకున్నాను  వంటి ప్రేమగీతాలైనా  …
ఇలా రాస్తూ పోతే ఇంక అంతే వుండదు. తన సంగీత మహాత్తుతో సినీ సంగీత ప్రియుల్ని సమ్మోహన పరచిన మహదేవన్ గారి వేలాది పాటల్లో ఇవి బహు కొద్ది పల్లవులు మాత్రమే… విశేషమైన ప్రజాదరణ పొందిన ఎన్నో తెలుగు పాటలను అర్ధవంతంగా, విలక్షణమైన బాణీలతో   చక్కని విరుపులు, చెణుకులతో ఏ పాట తీసుకున్నా ఏ చరణానికి  ఆ చరణం ఎంతో వైవిద్యంగా స్వరపరచిన ఘనత ఆయనదే. తెలుగు తమిళ భాషల్లో దాదాపు 500 చిత్రాలకు పైగా సుమధుర స్వరాలు సమకూర్చిన మహదేవన్ గారికి “కందన్ కరుణై” అనే తమిళ చిత్రానికి, “శంకరాభరణం” తెలుగు చిత్రానికి గాను ఉత్తమ సంగీత దర్శకునిగా కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని అందుకున్నారు. ఆత్రేయ గారి రచన “పాడుతా తీయగా సల్లగా ” గీతాన్ని అజరామరం చేసిన మామ, చరణాల్లో చెప్పినట్టు ” పోయినోళ్ళు అందరూ.. మంచోళ్ళే “.
https://www.youtube.com/watch?v=xkZ1H2vqQ6M
https://www.youtube.com/watch?v=8KSVrTGMCBQ
  ” కలనైనా క్షణమైనా మాయనిదే.. మన ప్రేమా మన ప్రేమా కలకాలం కావ్యంలా నిలిచేదే మన ప్రేమా మన ప్రేమా ” రాధా కళ్యాణం చిత్రం నుండి నారాయణరెడ్డి గారి రచనకు మహదేవన్ గారి అధ్బుత స్వర రచన. బాలు గారు సుశీల గారి గళం నుండి జాలువారిన మధురమైన గీతం.
Author:  Sarada Akunuri
12183950_1069921779707580_5796980806082433355_o
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →