Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

KVP Fires On AP CM Chadrababu Naidu

By   /  November 30, 2017  /  No Comments

    Print       Email

చంద్రబాబుపై కేవీపీ ఫైర్..!

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తోన్న పోల‌వ‌రం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేత కేవీపీ రామ‌చంద్ర‌రావు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడికి బ‌హిరంగ లేఖ రాశారు. చంద్ర‌బాబు ఇటీవ‌ల పోల‌వ‌రంపై చేసిన ప్ర‌క‌ట‌న‌ను ఆయ‌న‌ ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని కాంగ్రెస్‌ నేత కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చెప్తున్నవన్నీ అసత్యాలేనని, గతంలో పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు ఒక్కమాట కూడా మాట్లాడలేదని ఆయన అన్నారు.

2004-2014 ల మధ్య ప్రాజెక్ట్ కు అన్ని అనుమతులు సాధించి ప్రాజెక్ట్ టెండర్లు ఫైనలైజ్ చేసి, కాలువలు తవ్వకం దాదాపు పూర్తి చేయించిన వై.యస్.రాజశేఖర రెడ్డి సహా కాంగ్రెస్ ముఖ్యమంత్రుల పేర్లు గానీ ప్రస్తావించక పోవడం ఆయన విజ్ఞత ఏంటో తెలుస్తుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం కాలువలు తవ్వితే.. కోర్టుకెళ్లి చంద్రబాబు స్టేలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. రాజకీయ జన్మనిచ్చిన ఇందిరను, రాజకీయ పునర్జన్మనిచ్చిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది అని కేవీపీ మండిపడ్డారు. 2019నాటికే గ్రావిటీ ద్వారా నీళ్లిస్తామంటున్న చంద్రబాబు.. 1800 కోట్ల రూపాయలతో పురుషోత్తపట్నం ప్రాజెక్టును ఎందుకు చేపట్టారని కేవీపీ ప్రశ్నించారు. కేంద్రమే ప్రాజెక్టును చేపట్టి ఉంటే సమస్యలు వచ్చేవి కావని అన్నారు.

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →