Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

KVP Letter To Chandrababu About Polavaram Project

By   /  December 13, 2017  /  No Comments

    Print       Email

పోల‌వ‌రం ప్రాజెక్టుపై చంద్ర‌బాబుకి కేవీపీ లేఖ‌!

 

InCorpTaxAct
Suvidha

 

 

విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగిన ఆర్థిక నష్టానికి పరిహారంగా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించడంతో పాటు, ప్రాజెక్ట్ మొత్తాన్ని తామే నిర్మించి ఇస్తామని కేంద్ర ప్ర‌భుత్వం హామీ ఇచ్చింద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్‌ నేత కేవీపీ రామ‌చంద్ర‌రావు ఏపీ ముఖ్యమంత్రికి గుర్తు చేశారు. పోలవరంపై హైకోర్టులో తాను దాఖలు చేసిన వ్యాజ్యంలో కోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరపున వెంటనే కౌంటర్‌ దాఖలు చేయాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ప్ర‌భుత్వం పెట్టిన అనేక షరతులను ఒప్పుకొంటూ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని మీ చేతులలలోకి తీసుకొని అంచనాలను కేంద్ర అనుమతి లేకుండా, మీకు నచ్చిన రీతిలో పెంచుకొంటూ ప్రాజెక్ట్ ను ఈరోజు గందరగోళ పరిస్థికి తెచ్చారని కేవీపీ విమ‌ర్శించారు. అన్ని రాజకీయ పక్షాలు, చివరకు జనసేకి కూడా ప్రాజెక్ట్ నిర్మాణంపై అనుమానాలు ఉన్నాయని కేవీపీ లేఖలో పేర్కొన్నారు. తప్పేమీ చేయకపోతే శ్వేతప్రత్రం ఎందుకు విడుద‌ల చేయడం లేద‌ని అన్నారు. అసలు ఈ ప్రాజెక్ట్ ను ఎప్పటికి పూర్తి చేస్తారు అని ప్ర‌శ్నించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →