Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

KVP Ramachandra Rao on AP Special status..

By   /  March 21, 2017  /  Comments Off on KVP Ramachandra Rao on AP Special status..

    Print       Email

kvp-ramachandra-raoఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగుతుంది: కెవీపీ రామచంద్రరావు

 

InCorpTaxAct
Suvidha

 

 

ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ నేత కెవీపీ రామచంద్రరావు డిమాండ్ చేస్తున్నారు. రీసెంట్ గా కేంద్ర కేబినేట్ ఏపీ ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే పోలవరంకు పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చాలని కూడా నిర్ణయించింది. దీనిపై ఏపీ అధికార పక్షం నేతలు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో మరోసారి ఏపీ ప్రత్యేక హోదా కోసం కెవీపీ డిమాండ్ చేశారు.

ఏపీకి స్పెషల్ స్టేటస్ వచ్చేంత వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాకు, ప్రత్యేక ప్యాకేజీకి ముడిపెట్టవద్దని సూచించారు. ఇలా మాట్లాడటం సబబు కాదని అన్నారు. ప్రత్యేక హోదా వల్ల వచ్చే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. దీంతో పోలిస్తే ప్యాకేజీ వల్ల వచ్చేది సగం కూడా ఉండదన్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →