వైట్ హౌస్ గోడ దూకేందుకు మహిళ యత్నం..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉంటున్న వైట్ హౌస్ భద్రతపై ఇప్పటికే పలు విమర్శలు వచ్చాయి. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ మూడుసార్లు శ్వేత సౌధం గోడ దూకేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. వైట్ హోస్ కు దగ్గరలో ట్రెజరీ భవనం ఉంది. అక్కడ ఉన్న కంచె దాటి భవనం లోపలికి వచ్చేందుకు ఓ మహిళ ప్రయత్నించింది. అర్ధరాత్రి సమయంలో మార్సి అండర్ సన్ అనే మహిళ కంచెదాటి దూకేందుకు ప్రయత్నించడం కలకలం రేపుతోంది.
ఈ విషయం తెలిసుకున్న అధికారులు ఆ మహిలను అరెస్ట్ చేశారు. విచారణ సందర్భంగా ఆ మహిళ చెప్పిన సమాధానం విని పోలీసులు అవాక్కయ్యారు. తాను ట్రంప్ మాట్లాడాలని భావించానని అందుకే గోడ దూకేందుకు ప్రయత్నించానని చెప్పింది. మార్చి 21 ఈ మహిళ గోడ దూకేందుకు ప్రయత్నించడంతో అలారమ్ మోగింది. దీంతో భద్రత సిబ్బంది అలర్ట్ అయి మహిలను అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పుడు వదిలిపెట్టేశారు. మళ్ళీ ఈ నెల 24 ఆ మహిళ తిరిగి అదే పనిచేసింది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.