Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Lal Darwaza Bonalu Update..

By   /  July 17, 2017  /  Comments Off on Lal Darwaza Bonalu Update..

    Print       Email

ఘనంగా లాల్ దర్వాజా బోనాలు.. అమ్మవారికి బోనాలు సమర్పించిన భక్తులు..

 

InCorpTaxAct

 

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు లాల్‌దర్వాజా బోనాలు అద్దంపడతాయి. ఈ లాల్ దర్వాజా బోనాలను హైదరాబాద్‌ పాతనగరంలో వైభవంగా నిర్వహించారు. లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు తరలించ్చారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ముఖ్యంగా మహిళలు పెద్దయెత్తున ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజామునుంచే భక్తులు బారులు తీరారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక నిజామాబాద్ ఎంపీ కవిత అమ్మవారిని దర్శించుకుని బంగారు బోనం సమర్పించారు. ఎంపీలు రాపోలు ఆనందభాస్కర్‌, దేవేందర్‌గౌడ్‌, శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ తమ తమ కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాలు సందర్భంగా తెలంగాణ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘాను పెంచారు.

Swapna
InCorpTaxAct
Centillion Networks
    Print       Email

You might also like...

AP will convert the drugs free state: Ganta Srinivasa Rao

Read More →