Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Last love letter

By   /  February 24, 2016  /  Comments Off on Last love letter

    Print       Email

ఆఖరి ప్రేమలేఖ!Jiah-Khan-Suicide

నేను నిన్నెంతగా ప్రేమించానో తెలుసా!
నన్ను నేను కూడా అంతగా ప్రేమించుకోలేదు
నా సర్వస్వాన్ని నీకే సమర్పించిన ప్రేమ బికారీని నేను!
ఆకాశం భూమిని తాకే ఆ సుదూరప్రాంతాలదాకా నీతో ప్రేమవిహారం చేద్దామనుకున్నాను
నా భ్రమకానీ,
ఆకాశమే ఒక శూన్యం, అది భూమిని తాకటం అసాధ్యం!
ప్రేమపిచ్చిలో ఉన్న నాకు సాధ్యాసాధ్యాలెలా తెలుస్తాయి?
నేనే నీ దానినైతే ,అంతకన్నా నీకు కావలసినదేముంది?
ఇంకా నీకేమైనా కావాలంటే నీ కోసం బిచ్చమెత్తి నీకిచ్చే దాన్ని
ప్రేమంటే ఇవ్వటమే కానీ ,పొందటం కాదని తెలుసుకోలేకపోయాను
నీ రూపం నా కడుపులో పెరుగుతుందేమోనన్న భయానందాలతో ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపాను
భయం ఎందుకంటే పుట్టబోయే శిశువికి తండ్రి ఎవరని అడిగితే ఏమి చెప్పాలని
ఆనందం ఎందుకంటే మాతృత్వంలోని మధురిమలను రుచిచూడబోతున్నాని
మధురమైన ప్రేమ కూడా ఒక స్థాయిని మించితే అది విషంగా మారుతుందని తెలుసుకున్నాను
ఆ విషాన్నే మధుపానీయంగా స్వీకరించి ,నీ క్షేమం కోరుతూ
నీ నుండి శాశ్వతంగా అందని దూరతీరాలకు వెళుతున్నా ప్రియతమా!

InCorpTaxAct
Suvidha

(హిందీ నటి జియాఖాన్ మృతి పట్ల కలతచెంది వేదనతో వ్రాసిన కవిత )
టీవీయస్.శాస్త్రి

18

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →