Loading...
You are here:  Home  >  Deccan Abroad  >  Current Article

Let us live without any desire

By   /  February 25, 2016  /  Comments Off on Let us live without any desire

    Print       Email

ఏ కోరికలు లేకుండా జీవించుదాం!

putana
ఏ కోరిక లేకుండా మనదగ్గరికి వచ్చినవి మాత్రమే స్వీకరిస్తూ బ్రతకాలి! ఎందుకంటే, మనకు ఏమి కావాలో మనకు తెలియదు. ఉదాహరణకు–కోటి రూపాయల ధనం కావాలని కోరుకున్నామనుకోండి! కోటి రూపాయలు కూడా వచ్చాయనుకోండి, ఆ తర్వాతి మరు క్షణమే కాన్సర్ వ్యాధి సోకితే ఏమి ప్రయోజనం! కోరికలు బలీయమైతె అవి తప్పక నెరవేరుతాయి. అయితే, అవి నెరవేరేనాటికి వాటి అవసరముండదు. ఇవన్నీ మన జీవితంలో మనకు కలిగిన అనుభవాలే!​ అయితే, దురదృష్టవశాత్తు వాటిని మనం గమనించం. నేను 1996 లో పెనుగొండ ఆంద్ర బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తున్నాను. 1994 మే లో పెద్ద కుమార్తెకు తెనాలిలో వివాహం చేసాను. రెండో అమ్మాయి B. Com ఆఖరి సంవత్సరంలో ఉంది. కుమారుడు చిన్నవాడు. వాడికి గుంటూరులో ఇంజనీరింగ్ లో సీట్ వచ్చింది. మన మిత్రుడు బాల సుబ్రహ్మణ్యం గారింట్లో ఒక రూం తీసుకున్నాను వాడికోసం. బాల సుబ్రహ్మణ్యం గారి ఇల్లు గుటూరు నడిబొడ్డున ఉంటుంది.

InCorpTaxAct
Suvidha

చాలాకాలం, వాళ్ళింట్లో ఒక రూం నాకోసం ఉంచారు. నా అల్లుడు, మేనల్లుళ్ళు అక్కడ ఉండే చదువుకున్నారు! చిన్నవాడు కావటం వలన నా భార్యకు కుమారుడి మీద దిగులు ఉండేది. ఆమెను చూసి నేనూ దిగులు పడే వాడిని. గుంటూరుకు transfer అయితే బాగుండని కోరుకునే వాడిని. ఆ కోరిక నెరవేరింది! ఎలా నెరవేరిందో చెబుతాను. గుండెకు ఆపరేషన్ అయి compassionate గ్రౌండ్స్ మీద బదిలీ అయింది! కోరిక ఎలా నెరవేరిందో చూసారుగా! బదిలీ మాత్రం అయింది. అయితే, నేను కోరుకున్న విధంగా మాత్రం కాదు! అలా కోరికలు తీరుతుంటాయి! కోరికలు మరీ బలీయమైతే అవి తప్పక నేరువేరుతాయి కొన్ని యుగాల తరువాత కూడా! వీటికి ఉదాహరణగా కొన్ని పురాణాలకు సంబంధించిన అంశాలను చెబుతాను. యశోదాదేవికి శ్రీ కృష్ణుడి వివాహం చూడాలనే చిరకాల కోరిక కృష్ణావతారంలో తీరలేదు! యుగం మారిన తర్వాత కలియుగంలో వకుళా దేవిగా శ్రీనివాసుని కల్యాణం జరిపించింది. మరో గమ్మత్తైన ఉదాహరణ–వామనుడు దానం కోసం బలి చక్రవర్తి దగ్గరికి వస్తున్నాడు.బాలసూర్యుడి రూపంలో తేజోవంతుడుగా ఉన్నాడు. ఆ వటువును చూసి ముచ్చట పడింది బలి చక్రవర్తి కుమార్తె అయిన రత్నమాల! ఆ వటువును చూసి యేమని కోరుకుందో తెలుసా?ఈ అబ్బాయికి ‘పాలిస్తే బాగుండు’. అని కోరుకుంది. వామనుడు త్రివిక్రముడై బలిని పాతాళంలోకి తోక్కేటప్పుడు అదే రత్నమాల, ఈ కుర్రాడికి ‘విషమిస్తే బాగుండు’అని కోరుకుంది. అదే రత్నమాల ద్వాపరయుగంలో పూతన రూపంలో కృష్ణుడికి పాలిచ్చింది, విషమిచ్చింది!ఆమె కోరిక కోరుకున్న విధంగానే నెరవేరింది!ఆమె ఎక్కడా ఆ కుర్రాడికి తల్లి కావాలని కోరుకోలేదు! పాలు, విషం ఇస్తే బాగుండని కోరుకుంది. అదే నెరవేరింది. ఇటువంటి ఉదాహరణలు అందరి జీవితాల్లోనూ ఉంటాయి, అయితే చాలామంది గమనించరు.
ఇన్ని అనుభవాల దృష్ట్యా అందరికీ నేను విన్నవించుకునేది ఏమంటే,ఏ కోరికలు లేకుండా జీవించుదాం!

టీవీయస్.శాస్త్రి
878_TVS shastry

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →