హోదా వచ్చే వరకు పోరాటం
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు కలిసికట్టుగా పోరాటం చేస్తామని, పోరాటం వదిలిపెట్ట ప్రసక్తే లేదని ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధించుకునేందుకు చేసే ప్రయత్నంలో భాగంగా అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీ వెళ్లిన జగన్ రెండోరోజు కూడా బిజీబిజీగా గడిపారు. సీపీఐ జాతీయ నేత డి.రాజా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిసి ప్రత్యేక హోదాపై చర్చించారు. అనంతరం వైయస్ జగన్ మాట్లాడుతూ కీలకమైన వస్తుసేవల పన్ను (జీఎస్టీ) బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం అత్యావశ్యకంగా మారిందని జగన్ అన్నారు. త్వరలో చట్టంగా మారబోయే జీఎస్టీ వల్ల అమ్మకం పన్ను ప్రోత్సాహకాలు(సేల్స్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్) కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోతాయని, తద్వారా మౌలిక వసతు లు లేని ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు క్షీణిస్తాయని చెప్పారు. అందుకే రాష్ట్రాన్ని బతికించాలంటే ప్రత్యేక హోదా ఇవ్వక తప్పదని, ఆమేరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ప్రత్యేక హోదా హామీ అమలు చేయకుంటే పార్లమెంట్ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని పేర్కొన్నారు. గతంలో పార్లమెంటులో ఇచ్చిన ఏపీకి ప్రత్యేక హోదా హామీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని, ప్రత్యేకహోదా ఇవ్వకుంటే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని వారికి విన్నవించారు.
ప్రత్యేక హోదాపై పోరాటంలో తమకు మద్దతు ఇవ్వాలని డి.రాజా, సీతారాం ఏచూరిని కోరగా వాళ్లు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. జిఏస్టి బిల్లుతో ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా అనివార్యమైందన్నారు. ఇన్నాళ్లూ పెడ్డుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రాలు సేల్స్ ట్యాక్స్ మినహాయింపు తదితర ప్రోత్సాహకాలు ప్రకటించేవని, కానీ జీఎస్టీ బిల్లుతో ఇప్పుడా(ఇన్సెంటివ్స్) వ్యవహారం కేంద్రం చేతుల్లోకి పోయిందని జగన్ గుర్తుచేశారు. అసలే మౌలిక వసుతుల లేమితో కొట్టుమిట్టాడుతున్న ఏపీకి ఇక పెట్టుబడులు నామమాత్రం అవుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పుడున్న నిరుద్యోగ సమస్య ఇంకా పెరిగిపోతుందన్నారు. ఈ విపత్కర సమస్యలన్నింటికి ఒక్కటే పరిష్కారమని, అదే ప్రత్యేక హోదా అని, హోదా సాధించేదాకా వెనక్కి తగ్గేదేలేదు జగన్ స్పష్టం చేశారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.