Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

List of highest-grossing Telugu movies in US

By   /  August 14, 2016  /  Comments Off on List of highest-grossing Telugu movies in US

    Print       Email

pellichupuluవిదేశీ గడ్డపై తెలుగు సినిమా సత్తా చాటుతోంది..!

 

InCorpTaxAct
Suvidha

 

 

ఒకప్పుడు తెలుగు సినిమా అంటే తెలుగు గడ్డమీద మాత్రమే సత్తా చాటేది. అలాంటిది.. ఇప్పుడు ఓవర్సీస్ లోనూ అద్భుతాలు చేసి చూపిస్తోంది. ముఖ్యంగా కలెక్షన్లలో దూసుకుపోతోంది. దీనికి అమెరికా మంచి మార్కెట్ గా నిలిచింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాల్లో ‘అఆ’ అమెరికాలో మంచి కలెక్షన్లు రాబట్టుకుంది. అంతేకాదు.. నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 16.37 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది.

తర్వాతి స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ నాన్నకు ప్రేమతో..’ నిలిచింది. సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల్లో ఈ చిత్రమే అత్యధిక వసూళ్లు సాధించింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ‘ఊపిరి’ (10.45 కోట్లు), ’24’ (9.88 కోట్లు), ‘బ్రహ్మోత్సవం’ (7.77 కోట్లు), ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ (7.12 కోట్లు), ‘జెంటిల్‌మెన్‌’ (6.07 కోట్లు), ‘పెళ్లి చూపులు’ (5.94 కోట్లు), ‘సరైనోడు’ (5.93 కోట్లు), ‘సోగ్గాడే చిన్ని నాయనా’ (5.71 కోట్లు) నిలిచాయి.

సెన్సెషనల్ న్యూస్ ఏంటంటే.. సైలెంట్ గా విడుదలైన ‘పెళ్ళిచూపులు’ మూవీ అమెరికా బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటింది. మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ మూవీ ‘సరైనోడు’ చిత్రాన్ని దాటేసింది. అయినా ఇప్పటికీ మంచి వసూళ్ళు రాబడుతోంది. దీంతో తమ చిత్రం.. సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసే అవకాశం ఉందని చిత్ర యూనిట్ లెక్కలేసుకుంటోందట.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →