లోకేష్ స్కెచ్ ఫలిస్తుందా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ వ్యవహారాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ అభివృద్ధికి వ్యూహాలు రచిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్కు చెక్ పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నట్లు విశ్వసనీయ సమచారం. చిత్తూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు జగన్ సొంత జిల్లా కడపలో కూడా టీడీపీ పట్టు సాధించేందుకు లోకేష్ ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగానే ఇటీవల ఇదే జిల్లాకు చెందిన పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే జిల్లాలో వైసీపీ బలంగా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడైన రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చేందుకు లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ తండ్రికొడుకులిద్దరు పార్టీలో చేరితే రాజంపేట లోక్సభ నియోజకవర్గ పరిధిలో టీడీపీ చాలా బలోపేతం అవుతుందని టీడీపీ భావిస్తోంది. వీరు టీడీపీలో చేరితే వైసీపీ అధినేత జగన్కు రెండు షాకులు తగిలినట్టే.
అటు జగన్ సొంత జిల్లా కడపలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు ఇటు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉన్న రాజంపేట లోక్సభ నియోజకవర్గానికి వైసీపీ నుంచి బలమైన అభ్యర్థి లేకుండా పోతాడు. ఇక పార్టీ కూడా ఇక్కడ వీక్ అవుతుంది. ప్రస్తుతం మధ్యవర్తుల ద్వారా లోకేష్ పెద్దిరెడ్డి, మిథున్రెడ్డిలతో చర్చలు జరిపిస్తున్నట్టు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో వైసీపీ తరపున గట్టిగా వాయిస్ వినిపిస్తున్న పెద్దిరెడ్డి ఫ్యామిలీ టీడీపీలో చేరితే మాత్రం లోకేష్ స్కెచ్ ఫలించినట్లే. అయితే అది అంత సులువు కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వాళ్లు టీడీపీలో చేరకపోవడానికి బాబుకు పెద్దిరెడ్డికి మధ్య మొదటి నుంచి వైరమే కారణమని కూడా వారంటున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.