Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Low Quality Construction 2 Bed Room house for just 3 Lakhs in Telangana

By   /  April 6, 2018  /  Comments Off on Low Quality Construction 2 Bed Room house for just 3 Lakhs in Telangana

    Print       Email

స‌ర్కార్‌కు చెడ్డ‌పేరు తెస్తున్న `డ‌బుల్ బెడ్ రూం` ఇళ్లు

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* గాలికే కూలుతున్న గోడ‌లు

* ముట్టుకుంటేనే విరిగిపోతున్న ఇటుక‌లు

* నాసిర‌కం ప‌నుల‌పై ప్ర‌జ‌ల ఆగ్ర‌హం

డెక్క‌న్ అబ్రాడ్‌: నిరుపేదలకు నీడ కోసం తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్‌రూం పథకం దారితప్పుతోందా? నిర్మాణాలలో గుత్తేదారులు నాణ్యతను గాలి కొదిలేసారా? అంటే అవుననే అంటున్నారు ప్ర‌జ‌లు . డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామంటూ ప్రకటించిన ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంది. ఏటేటా నిధులనూ కేటాయిస్తోంది. అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం ఈ నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి.  డబుల్ బెడ్‌రూంల నిర్మాణాలు నాసిరకంగా జరుగుతున్నాయని విమర్శలు ఎదురవు తున్నాయి. మొన్నటి ఈదురు గాలులు, వర్షాలకు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లు పాక్షికంగా కూలిపోయాయి. గతంలో కల్లూరులోనూ ఈ తరహా ఘటన చోటుచేసుకోగా.. నేడు కూసుమంచి మండలంలోనూ అదే సంఘటన జరగడం స్థానికులను షాక్‌కు గురిచేసింది. ఈ రెండు ఘటనలూ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహించిన, ప్రస్తుతం వహిస్తున్న సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాల్లో జరిగాయి.

కూసుమంచి మండలం నేలపట్ల గ్రామంలో చిన్నపాటి గాలిదుమారానికే 9 డబుల్ బెడ్‌రూం ఇండ్ల పిట్టగోడలు కూలిపోయాయి. నాసిరకం ఇటుకలు, కల్తీ సిమెంట్‌తో నిర్మిస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. గతంలో కల్లూరు మండలం చిన్నకోరుకొండి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇల్లు కూలిపోయింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నేలపట్ల గ్రామంలో డబుల్ బెడ్‌రూం పథకం కింద ప్రభుత్వం 18 ఇళ్ల‌ను మంజూరు చేసింది. ఫిబ్రవరి మొదటి వారంలో ఇళ్ల నిర్మాణానికి అధికారులు శంకుస్థాపన చేశారు. నిర్మాణ బాధ్యతలను అధికార పార్టికి చెందిన  ఓ కాంట్రాక్టరుకు అప్పగించారు. పనులు ప్రారంభమై 3 నెలలు గడుస్తున్పటికి ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →