Loading...
You are here:  Home  >  Politics  >  Delhi Politics  >  Current Article

Lucknow, Warangal among 13 smart cities announced by Venkayya Naidu

By   /  May 25, 2016  /  Comments Off on Lucknow, Warangal among 13 smart cities announced by Venkayya Naidu

    Print       Email

warangalఓరుగ‌ల్లు ఇక `స్మార్ట్‌`

 

InCorpTaxAct
Suvidha

 

 

వ‌రంగ‌ల్‌కు మొద‌టి విడ‌త‌లోనే రావాల్సిన స్మార్ట్ సిటీ హొదా కొంత ఆల‌స్య‌మైన రెండో విడ‌త‌లో మాత్రం చోటు ద‌క్కింది. కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి వెంక‌య్య నాయుడు ఢిల్లీలో స్మార్ట్ సిటీలకు ఎంపికైన 13 న‌గ‌రాల జాబితాలో మొద‌ట ల‌క్నో త‌ర్వాత వ‌రంగ‌ల్ పేరు ప్ర‌క‌టించారు. అయితే వరంగల్‌కు అన్ని అర్హ‌త‌లు ఉన్నా డీపీఆర్ రూపకల్పనలో కొన్ని పాయింట్లు తక్కువగా రావ‌డం, 0.7 మార్కుల తేడాతో మొద‌టి విడ‌త‌లో ఎంపిక కాక‌పోవ‌డంతో వరంగల్ సిటీ ఫాస్ట్‌ట్రాక్ డీపీఆర్ రూపకల్పనపై మేయర్ నన్నపునేని నరేందర్, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రత్యేకదృష్టి సారించారు. ఇటీవల కేంద్రంలోని ఆరుశాఖలు నిర్వహించిన సదస్సులో వరంగల్ నగర చరిత్ర, చారిత్ర‌క‌ నేపథ్యంతోపాటు స్మార్ట్‌సిటీ అర్హత ఉంద‌ని మేయర్ నన్నపునేని నరేందర్ వివరించారు.

హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, దీని బదులు తొలి విడుత స్మార్ట్ సిటీల్లో వరంగల్, కరీంనగర్‌ను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రానికి లేఖరాసింది. వరంగల్‌కు త్రుటిలో అవకాశం చేజారడంతో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచింది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన రెండోవిడుత స్మార్ట్‌సిటీలో వరంగల్‌కు చోటుదక్కింది. దీంతో చారిత్రక ఓరుగల్లు సిగలో మరో కలికితురాయి వచ్చిచేరింది. దీంతో వ‌రంగ‌ల్‌ను హైద‌రాబాద్‌కు దీటుగా త‌యారు చేయాల‌ని తెలంగాణ స‌ర్కార్ ఎప్పుటి నుంచో భావిస్తోంది. ఇప్పుడు అది మ‌రింత సులువ‌వుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →