Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Lunch with Warren Buffett, how much does it cost?

By   /  June 12, 2016  /  Comments Off on Lunch with Warren Buffett, how much does it cost?

    Print       Email

WarrenBuffettఅత‌నితో లంచ్ చేయాలంటే రూ.23 కోట్లు ఖ‌ర్చు చేయాలా?

 

InCorpTaxAct
Suvidha

 

 

ఎవ‌రు న‌మ్మినా.. న‌మ్మ‌క‌పోయినా ఇది అక్ష‌రాల నిజం. ఒక వ్య‌క్తితో భోజ‌నం చేయ‌డానికి మ‌రోవ్య‌క్తి ఖ‌ర్చు చేసిన మొత్తం అక్ష‌రాల రూ.23 కోట్లు. అత‌ను అమెరికా అధ్య‌క్షుడు కాదు.. లేక‌పోతే హాలీవుడ్ సెట్ర‌బిటీ కాదు.. మ‌రి ఎందుకు అంత డ‌బ్బు ఖ‌ర్చుపెట్టాడు? ఎవ‌రా ప్ర‌ముఖ వ్య‌క్తి అనుకుంటున్నారా? అయితే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.  ప్రపంచ ప్రఖ్యాత సంపన్నుడు వారెన్ బఫెట్. ఒక చారిటీ కోసం నిదులు సేకరించే నిమిత్తం.. వారెన్ బఫెట్ తనతో లంచ్ చేయటానికి వేలం నిర్వహించారు. ఈ వేలంలో ఎవరైతే అత్యధిక మొత్తం చెల్లిస్తారో అతనితో వారెన్ బఫెట్ లంచ్ చేస్తారు. అయితే మొన్న నిర్వహించిన వేలం పాటలో బఫెట్ తో లంచ్ చేసే అవకాశాన్ని చైనాలోని బీజింగ్ కు చెందిన దలియాన్ జేయూన్ ఎంటర్ టైన్ మెంట్ కో సొంతం చేసుకుంది.

బఫెట్ తో లంచ్ కోసం జరిపిన వేలం పాటలో 3456789 డాలర్లకు లంచ్ స్లాట్ ను సొంతం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని మన రూపాయిల్లో చూస్తే దాదాపు రూ.23.14 కోట్లుగా ఉంటుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ అంకెల్ని చూస్తే.. వరుస సంఖ్యలో ఉండటం విశేషం. తనతో లంచ్ చేసే అవకాశం కోసం వేలం పాట నిర్వహించే బఫెట్.. అలా వచ్చిన మొత్తాన్ని గ్లైడ్ ఫౌండేషన్ కింద నిరాశ్రయులైన పేదల వసతి కోసం.. భోజనం.. విద్యా.. వైద్య.. ఉపాధి అవకాశాల కోసం ఖర్చు చేస్తుంటారు. బ‌ఫెట్ చేసేది మంచి ప‌నే అయినా మ‌రీ లంచ్ కోసం రూ.23 కోట్లా?.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →