సంసారం రథమైతే తలిదండ్రులు చక్రాలే..!
అదే ఓ పల్లకైతే..ఆ ఇద్దరు బోయీలే..!
జ్ఞానమెంతొ పొందేందుకు ఎంత సాయమౌతారో..!
మన బ్రతుకులు పండించే ఆ మనసులు గగనములే..!
అమ్మ.. నాన్న అవుతున్నది.. ఉద్యోగం చేస్తూ మరి..!
బాధ్యతలను మోస్తు ఉన్న వారిరువురు సమానులే..!
నాన్న కూడా అమ్మప్రేమ పంచుచుండు గమనిస్తే..!
ఎన్ని పనులు చేస్తారో అవిరామపు తపములులే..!
భూమి పైన మొదటి పూజ తలిదండ్రుల సేవ సుమా..!
భేషజాలు ఎందుకటా..అసలు సిసలు దైవములే..!
మనమేగా కాబోయే..తలిదండ్రులు ముందుముందు..
ఈ తనువులు పుణ్యవశము వారి ధ్యాన ఫలములులే..!
మాటలెన్ని చెప్పిననూ తీరనిదే వారి ఋణము..!
మాధవునకు అందనిదే..ధ్యాననిధుల త్యాగములే..!
Author:
madhavarao koruprolu
|
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.