సంతోషం కోసం మంత్రిత్వ శాఖ?
దైనందిన జీవితంలో మనిషి యాంత్రికంగా పని చేసుకుంటూ పోతున్నాడే తప్పితే సంతోషంగా గడిపే క్షణాలే ఉండడం లేదు. ఎప్పుడూ పని ఒత్తిడితో అనారోగ్య పాలవుతున్నారు. కొత్త కొత్త జబ్బులకు లక్షల రూపాయలు తగలేస్తున్నారు. అసలు ఆరోగ్యంగా ఉండాలంటే ముందు ఆనందంగా ఉండడం నేర్చుకోవాలి. ఆనందంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటామని గ్రహించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ కొత్త నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వరకు దేశంలో ఇలా నిర్ణయం బహుషా ఏ రాష్ట్రం కూడా తీసుకోలేదు. ప్రజలను సంతోషపరచడానికి ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసే యోచనలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలు పెట్టింది. 70ఏళ్ల వయస్సులోనూ ప్రజలు సంతోషంగా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేలా ఆ శాఖ పని చేస్తుంది.
దైనందిక జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్ల నుంచి ప్రజలకు మనశ్శాంతి కలిగించడం, వారికి ఉపశమనం కల్పించడం ఈ శాఖ పని. యోగాభ్యాసం, ఆధ్యాత్మికత భావాలు పెంపొందించడం, ధ్యానం చేయించడం వంటి ద్వారా ప్రజలకు ఉపశమనం కల్పించే ప్రయత్నం చేస్తారు. తద్వారా వారి ఆయుష్షు పెరుగుతుందని, 70ఏళ్ల వయస్సులోనూ ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా జీవిస్తారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. యోగా అభ్యాసకుడైన చౌహాన్ స్వయంగా కొత్త మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తారని కూడా అక్కడి వారు అనుకుంటుండడం విశేషం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.