Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

మహాప్రస్థానం

By   /  June 14, 2016  /  Comments Off on మహాప్రస్థానం

    Print       Email

sree sree

నేడు మహాకవి శ్రీ శ్రీ వర్ధంతి. ఆ మహనీయునికి నా  ఘనమైన నివాళి!
**********
మరో ప్రపంచం ,
మరో ప్రపంచం ,
మరో ప్రపంచం పిలిచింది !
పదండి ముందుకు ,
పదండి త్రోసుకు !
పోదాం , పోదాం పైపైకి !
 
కదం తొక్కుతూ ,
పదం పాడుతూ,
హృదంత రాళం గర్జిస్తూ __
పదండి పోదాం
వినబడలేదా
మరో ప్రపంచపు జలపాతం ?
 
దారి పొడుగునా గుండె నెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు !
బాటలు నడచీ ,
పేటలు కడచీ ,
కోటలన్నిటినీ దాటండి !
నదీ నదాలూ ,
అడవులు  , కొండలు ,
ఎడారులు మన కడ్డంకి ?
పదండి ముందుకు !
పదండి త్రోసుకు !
పోదాం పోదాం పైపైకి !
 
ఎముకలు క్రుళ్లిన ,
వయస్సు మళ్లిన
సోమరులారా ! చావండి !
నెత్తురు మండే ,
శక్తులు నిండే
సైనికులారా ! రారండి !
“ హరోం ! హరోం హర !
హర ! హర ! హర! హర !
హరోం హరా ! “ అని కదలండి !
 
మరో ప్రపంచం ,
మహా ప్రపంచం
ధరిత్రి నిండా నిండింది !
పదండి ముందుకు ,
పదండి త్రోసుకు !
ప్రభంజనంవలె హొరెత్తండీ !
భావ వేగమున ప్రసరించండీ !
వర్షుకా భ్రముల ప్రళయగోషవలె
పెళ పెళ పెళ పెళ విరుచుకు పదండి !
పదండి ,
పదండి ,
పదండి ముందుకు !
కనబడ లేదా మరో ప్రపంచపు
కణకణ మండే త్రేతాగ్ని ?
 
ఎగిరి , ఎగిరి , ఎగిరి పడుతున్నవి
ఎనభై లక్షల మేరువులు !
తిరిగి , తిరిగి , తిరిగి సముద్రాల్
జల ప్రళయ నాట్యం చేస్తున్నవి !
సలసల క్రాగే చమురా ? కాదిది ,
ఉష్ణరక్త కాసారం !
శివసముద్రమూ ,
నయాగరా వలె ,
ఉరకండీ ! ఉరకండీ ముందుకు !
పదండి ముందుకు ,
పదండి త్రోసుకు !
మరో ప్రపంచపు కంచు నగారా
విరామ మెరుగక మ్రోగింది !
 
త్రాచుల వలెనూ ,
రేచులవలెనూ ,
ధనంజయునిలా సాగండి !
కనబడ లేదా
మరో ప్రపంచపు
అగ్ని కిరీటపు ధగధగలు ,
ఎర్రబావుటా నిగనిగలు ,
హొమ జ్వాలల భుగ భుగలు ? 
 
శ్రీ శ్రీ గొంతుకలో ఈ గీతాన్ని ఇక్కడ https://www.youtube.com/watch?v=59EOlXR6ips వినండి!
 
టీవీయస్.శాస్త్రి  
TVS SASTRY
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →