Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Mahesh Babu joining TDP!

By   /  May 11, 2016  /  Comments Off on Mahesh Babu joining TDP!

    Print       Email

maheshమహేష్ టీడీపీలో చేరాడా?

 

InCorpTaxAct
Suvidha

 

 

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఏదో చేయాల‌నుకుంటే ఇంకేదో అయింద‌నిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి రాజ‌కీయ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌ని మ‌హేష్ బాబు ఇప్పుడు సొంతూరు కోసం ఏదో చేయాల‌నుకుంటే అది ఇప్పుడు రాజ‌కీయ రంగు పులుముకుంది. మహేష్‌ బుర్రిపాలెంలో తాజా పర్యటనలో ఏపీ అధికారపక్ష నేతల హడావుడి ఎక్కువగా కనిపించటం గమనార్హం. అధికారపార్టీకి చెందిన గ‌ల్లా జ‌య‌దేవ్ ఎంపీ సొంత బావ అయిన నేపథ్యంలో తమ్ముళ్ల సందడి కనిపించటం తప్పేం కాదన్న మాట వినిపిస్తున్నా.. ‘లెక్క’లో ఏదో తేడా ఉందన్న వాదన ఒకటి వినిపిస్తోంది. వివాదాలకు కిలో మీటర్ల దూరంలో ఉండే అలవాటున్న మహేశ్.. తాజాగా ఊరు దత్తత విషయంలో తన బావ పాత్రను తరచూ ప్ర‌స్తావించారు. మహేశ్ మైండ్ సెట్ ను చూసినప్పుడు.. తన పని ఏమిటో అది చూసుకోవటమే తప్పించి.. సంబంధం లేని విషయాల్లో తలదూర్చటం కనిపించదు. అలాంటి మహేశ్ తన దత్తత తీసుకున్న ఊరి కార్యక్రమంలో ఏపీ తెలుగుదేశం నేతలు.. కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనటం కనిపిస్తుంది.

దీన్ని బ‌ట్టి చూస్తే మ‌హేష్ తెలుగుదేశం పార్టీలో చేరాడా? అనే అనుమానం క‌లుగ‌క మాన‌దు. ఇక్క‌డ ఇంకో విష‌యం ప్ర‌స్తావించారు. తెలుగుదేశానికి, భార‌తీయ జ‌న‌తా పార్టీకి దూరం పెరుగుతుండ‌డం ఒక కార‌ణ‌మైతే.. జ‌న‌సేన అధినేత  ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డం మ‌రో కార‌ణం. వీళ్ల ఇద్ద‌రికి చెక్ చెప్పాలంటే మ‌హేష్ బాబు తెలుగుదేశానికి స‌పోర్ట్ చేస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా టీడీపీకి తిరుగు ఉండ‌ద‌ని భావించే గ‌ల్లా జ‌య‌దేవ్ ద్వారా మ‌హేష్‌ను టీడీపీలోకి లాగాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →