ముద్దుముద్దుగా కనిపిస్తున్న మహేష్ కూతురు సితార..
మహేష్ బాబు ఎలా ఉంటారు..? అని అడిగితే.. ఆయనకేంటి అందగాడు అంటూ ఆయన అభిమానులు ఠక్కున చెబుతారు. మరి ఆయన పిల్లలు ఎలా ఉంటారు. గౌతమ్ ని చూసిన తర్వాత ముద్దు ముద్దుగా ఉంటారు అని కూడా చెబుతారు. ముఖ్యంగా సితార ఎలా ఉంటుంది అని అడిగితే మాత్రం చాలామంది దగ్గర సమాధానం ఉండకపోవచ్చు. ‘1 నేనొక్కడినే’ మూవీతో గౌతమ్ తెరగేట్రం చేసేశాడు. సితార విషయానికొస్తే మహేష్ తో కలిసి ‘బ్రహోత్సవం’ సినిమాలో కనిపించబోతోంది. ఈ విషయం అందరికి తెలిసిందే. మరి తెర మీద సితార ఎలా ఉండబోతోంది..? దీని గురించే మహేష్ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అందుకేనేమో మహేష్ ఫ్యామిలీ సితార ఫొటోను రిలీజ్ చేశారు.
ఈ ఫొటోలో ఉన్న సితారను చూసి ముందు ‘బ్రహోత్సవం’ సినిమాకు సంబంధించినది అని పొరపాటు పడ్డారు. కాని అది నిజం కాదు. మహాశివరాత్రి సందర్భంగా తీసిన ఓ ఫొటోను మహేష్ ఫ్యామిలీ రిలీజ్ చేసింది. అందులో రెండు జడలతో క్యూట్ గా కనిపిస్తూ ముద్దు ముద్దుగా ఉన్న చిన్నారి దేవుడికి దణ్ణం పెడుతూ కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అంతలా సితార అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోందన్నమాట.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.