Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Mahesh’s new look for Murugadoss’s next..?

By   /  August 24, 2016  /  Comments Off on Mahesh’s new look for Murugadoss’s next..?

    Print       Email

mahesh - pvpమురుగదాస్ మూవీ కోసం మహేష్ న్యూ లుక్ ..?

 

InCorpTaxAct
Suvidha

 

 

ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రం దక్షిణాదిలోనే క్రేజీ ప్రాజెక్ట్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో మహేష్ న్యూ లుక్ లో కనిపించేందుకు ట్రై చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. గుబురు గడ్డంతో, ఒత్తైన మీసంతో కనిపిస్తాడని పుకార్లు వినిపిస్తున్నాయి.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మహేష్ అండర్‌ కవర్‌ కాప్‌గా కనిపించనున్నారు.ఇంచుమించు సినిమా అంతా ఈ గెటప్‌లోనే కనిపిస్తాడని అనుకుంటున్నారు. అయితే చిరు 61వ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా అదంతా అబద్ధమని తేలిపోయింది. పార్క్‌ హయత్‌లో జరిగిన ఈ వేడుకలో మహేష్‌ తన రెగ్యులర్‌ లుక్‌లోనే దర్శనమిచ్చాడు. ప్రెజెంట్ ఈ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌లోనే జరుగుతోంది.
ఉదయం ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న మహేష్‌ సాయంత్రం చిరు బర్త్ డే పార్టీకి వచ్చాడు. ఒకవేళ ఈ సినిమా కోసం మహేష్‌ ఏదైనా కొత్త లుక్‌ ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా ఆ గెటప్‌లోనే పార్టీకి హాజరయ్యేవాడని టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. కాని అలా లేకపోవడంతో మహేష్‌ న్యూ లుక్‌ ని ఓ గాపిప్ గా కొట్టిపాడేస్తున్నాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →