Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Malla Reddy is also joining TRS

By   /  June 1, 2016  /  Comments Off on Malla Reddy is also joining TRS

    Print       Email

MallaReddyటీఆర్ఎస్ గూటికి టీడీపీ ఎంపీ

 

InCorpTaxAct
Suvidha

 

 

తెలంగాణ రాష్ట్రంలో ఇక వ‌ల‌స‌లు ఆగిపోయాయ‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు ఊపిరి పీల్చుకున్న త‌రుణంలో టీటీడీపీ మ‌ల్కాజిగిరి ఎంపీ మ‌ల్లారెడ్డి బాంబు పేల్చాడు. తాను తెలంగాణ రాష్ట్ర స‌మితిలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  రాష్ట్రంలో రెండేండ్లుగా అధికార టీఆర్‌ఎస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై పలు సందర్భాల్లో ఆయన సానుకూలంగా అభిప్రాయాలు వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని, ప్రధానంగా డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పేదల పాలిట వరమని మల్లారెడ్డి ముఖ్యమంత్రి పాల్గొన్న బహిరంగసభల్లో చాలాసార్లు మెచ్చుకున్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీ పట్ల చూపుతున్న ఆదరణ తనను కదిలిస్తున్నదని, ప్రజల పక్షాన నిలిచేందుకు టీఆర్‌ఎస్‌లో చేరాలనుకుంటున్నట్లు ఎంపీ మల్లారెడ్డి పలు సందర్భాలలో ప్రకటించారు కూడా.

మ‌ల్లారెడ్డి టీఆర్ఎస్‌లో చేరుతుండ‌డాన్ని టీటీడీపీ నేత‌లు జీర్ణించుకోలేక పోతున్నారు. ఒకొక్క‌రుగా పార్టీ మారుతుండ‌డంతో ఏం చేయాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. అధికార పార్టీని గ‌ట్టిగా నిల‌దీద్దామ‌నుకుంటుంటే ఒకొరొక‌రు జారుకోవ‌డం ఆ పార్టీకి మింగుడు ప‌డ‌డం లేదు. అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపు ఖాళీ అయిన‌ట్లేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. కాగా 2014 ఎన్నిక‌ల్లో రాజ‌కీయ అరంగేట్రం చేసిన విద్యాసంస్థ‌ల అధినేత మ‌ల్లారెడ్డి  టీడీపీ అభ్య‌ర్థిగా మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్నిక‌యిన విష‌యం తెలిసిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →