Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

మనసున మల్లెలల మాలలూగెనే కన్నుల వెన్నెల డోలలూగెనే

By   /  March 21, 2016  /  Comments Off on మనసున మల్లెలల మాలలూగెనే కన్నుల వెన్నెల డోలలూగెనే

    Print       Email
మనసున మల్లెలల మాలలూగెనే కన్నుల వెన్నెల డోలలూగెనే
Malliswari(1951)
చిత్రం–మల్లీశ్వరి – 1951
సంగీతం : సాలూరి రాజేస్వర రావు 
రచన : దేవులపల్లి 
పాడినవారు : భానుమతి
****
మల్లీశ్వరి
తెలుగు చలనచిత్ర చరిత్రలో సాటిలేని మేటి కళాఖండంగానూ, అపురూప దృశ్యకావ్యంగానూ మల్లీశ్వరి ఖ్యాతిగాంచింది. ఆ సినిమా ఎన్నిదేశాలు తిరిగిందో లెక్క లేదు. రాచరికపు ఆడంబరాలను, ఆచారాలను చిత్రించినా ఆ సినిమా కమ్యూనిస్టు దేశమైన చైనా లోనే వందరోజులకు పైగా ఆడింది. ఆ సినిమాకు మాటలు, పాటలు, కళ, నటన, సంగీతం, ఛాయాగ్రహణం, ఎడిటింగులతో సహా అంతా తానై బి.ఎన్. నడిపించినవే. అందుకే కృష్ణశాస్త్రి “మల్లీశ్వరి సృష్టిలో మేమంతా నిమిత్తమాత్రులం. బి.ఎన్.రెడ్డి గారు దీనికి సర్వస్వం.” అన్నాడు.
నేపథ్యం
******
శ్రీకృష్ణదేవరాయలంటే ఆరాధనాభావమున్న బి.ఎన్. రాయలవారి మీద ఒక సినిమా తీయాలని సంకల్పించారు. ఆంధ్రాంగ్ల సాహిత్యాలను విస్తృతంగా అధ్యయనం చేసిన బి.ఎన్. తమ తొలి సినిమా ‘వందేమాతరం’ షూటింగు కోసం హంపి వెళ్ళినప్పటి నుంచి అందుకు తగిన కథ కోసం వెదుకుతూనే ఉన్నారు. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో వచ్చిన ఒక కథ, బుచ్చిబాబు వ్రాసిన రాయలకరుణకృత్యం నాటిక కలిపి దేవులపల్లి కృష్ణశాస్త్రి చేత “మల్లీశ్వరి” స్క్రిప్టుగా అభివృద్ధి చేశారు. అయితే బుచ్చిబాబు పేరు కథారచయితగా సినిమాలో క్రెడిట్ ఇవ్వలేదు.
సినిమా కథ
*********
విజయనగర సామ్రాజ్యం చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన నేపధ్యంలో ఈ చిత్ర కథ నడుస్తుంది. అప్పటి రాజవిధానం ప్రకారం రాజాంతఃపురంలో పనిచేయడానికి ఇష్టపడిన యువతులను వారింటికి పల్లకీ పంపి, వారి కుటుంబానికి ధన కనక బహుమానాలు ఇచ్చి, రాజాస్థానానికి పిలిపించేవారు. కాని ఒకసారి అంతఃపురంలో చేరిన యువతులకు బయటి మగవారితో సంబంధాలు నిషిద్ధం. ఈ నియమాన్ని అతిక్రమించినవారికి ఉరిశిక్ష వేసేవారు.
మల్లిక (చిన్నపుడు బేబీ మల్లిక, పెద్దయ్యాక భానుమతి), నాగరాజు (చిన్నపుడు మాస్టర్ వెంకటరమణ, పెద్దయ్యాక నందమూరి తారక రామారావు) బావా మరదళ్ళు. ఒక చిన్నపల్లెలో కలసి పెరిగారు. ఒకరిపై ఒకరు మనసు పడ్డారు. నాగరాజు శిల్పి. మల్లిక మంచి గాయని. ఒకసారి వారు వర్షం వచ్చినపుడు ఒక పాతగుడిలో ఉండగా అక్కడికి మారువేషంలో ఆ దేశపురాజు శ్రీకృష్ణదేవరాయలు (శ్రీవత్సవ), ఆయన ఆస్థాన కవి అల్లసాని పెద్దన (న్యాపతి రాఘవరావు)వస్తారు. అతిధులకు మల్లిక, నాగరాజు ఆహారం సమకూర్చి ఆదరిస్తారు.మల్లీశ్వరి జావళి నృత్యాన్ని చూసి ఆనందిస్తాడు నాగరాజు. శ్రీకృష్ణదేవరాయలు, వారి ఆస్థాన కవి బృందం కూడా ఆ నృత్యాన్ని చూసి ఆనందపడతారు. వారిని సాగనంపుతూ నాగరాజు వేళాకోళంగా మా మల్లికి రాణివాసం పల్లకి పంపించండి అని అంటాడు.
మల్లీశ్వరి తల్లికి డబ్బు ఆశ ఎక్కువ. అది సంపాదించడం కోసం నాగరాజు ఊరువిడిచి వెడతాడు. ఈలోగా నిజంగానే కొద్దిరోజులకు రాణివాసం పల్లకి మల్లి ఇంటికి వస్తుంది. కూతురికి పట్టిన రాణివాస యోగం చూసి మల్లి తల్లి నాగమ్మ (ఋష్యేంద్రమణి) మురిసిపోతుంది. మల్లి క్రమంగా అంతఃపురంలో మహారాణికి ఇష్టసఖి మల్లీశ్వరి అవుతుంది. కాని ప్రియురాలికి దూరమైన నాగరాజు, బావకు దూరమై మల్లి విలవిలలాడిపోతారు. అయితే రాణివాసం వలన వచ్చిన సంపద వల్ల నాగమ్మ తన కూతురిని నాగరాజునుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది.
తిరిగి వచ్చిన నాగరాజు హతాశుడై విరాగిగా శిల్పాలు చెక్కుతూ ఒక బృందంతో కలిసి విజయనగరం చేరతాడు. ఒకనాడు మంటప నిర్మాణం చూడడానికి వచ్చిన మల్లీశ్వరి బావను గుర్తిస్తుంది. మరునాడు వారిరువురు నదీ తీరాన కలుస్తారు. అక్కడనుంచి ఆ మరునాడు తప్పించుకుని వెడదామని అనుకుంటారు. ఎంతకూ రాని మల్లీశ్వరికై సాహసించి కోటలో ప్రవేశించిన నాగరాజును, మల్లీశ్వరిని సైనికులు బంధిస్తారు. అందుకై మరణశిక్ష పడవలసి ఉన్నా, వారిరువురి ప్రేమను అర్థం చేసుకున్న రాయలవారు పెద్ద మనసుతో వారిని క్షమించి వదిలేయడంతో కథ ముగుస్తుంది.
విశేషాలు
******
ఈ చిత్రాన్ని సర్వేపల్లి రాధాకృష్ణ చూసారు. ఆయన గమనించిన విషయం- చిత్రంలో మల్లి, నాగరాజులు, మారువేషంలో ఉన్న రాయలవారిని కలిసింది పెద్దవర్షం వచ్చిన కారణంగా. ఐతే రాయలవారు వీరితో మాట్లాడి తిరిగివెళ్ళిపోయే సమయంలో గుర్రాల స్వారీ వల్ల ధూళి రేగుతుంది. ఇది ఎలా సాధ్యం?
మల్లీశ్వరి చలనచిత్రం ద్వారా చిత్రరంగానికి ప్రముఖ కవి, భావకవితోద్యమంలో ముఖ్యుడైన దేవులపల్లి కృష్ణశాస్త్రి ని పరిచయం చేశారు.
******
మనసున మల్లెలల మాలలూగెనే కన్నుల వెన్నెల డోలలూగెనే 
ఎంత హాయి ఈరేయి నిండెనో 
ఎంత హాయి ఈరేయి నిండెనో ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో 
కొమ్మల గువ్వలు గుసగుస మనినా రెమ్మల గాలులు ఉసురుసురనినా 
అలను కొలనులో గలగల మనినా అలను కొలనులో గలగల మనినా 
దవ్వుల వేణువు సవ్వడి వినినా దవ్వుల వేణువు సవ్వడి వినినా 
నీవు వచ్చేవని నీపిలుపే వినీ నీవు వచ్చేవని నీ పిలుపే విని 
కన్నుల నీరిడి కలయచూచితిని 
గడియయేమి ఇక విడిచిపోకుమా గడియయేమి ఇక విడిచిపోకుమా 
ఎగసిన హృదయము పగులనీకుమా 
ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో ఎంత హాయి ఈ రేయి నిడెనో 
 
ఈ పాటను ఇక్కడ  https://www.youtube.com/watch?v=CF1v6M6m86U వినండి !
టీవీయస్.శాస్త్రి   
TVS SASTRY
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →