Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Mallikarjun Kharge response on SM Krishna party change..

By   /  March 22, 2017  /  Comments Off on Mallikarjun Kharge response on SM Krishna party change..

    Print       Email

Mallikarjun Khargeఎస్ఎం కృష్ణ తప్పు చేస్తున్నారు.. ఆవేదన వ్యక్తం చేసిన ఖర్గే..

 

InCorpTaxAct
Suvidha

 

 

కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్ఎం కృష్ణ కాషాయం కండువా కప్పుకోబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఆయన కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. అలాగే ఆయన్ను కాంగ్రెస్ హయాంలో మహారాష్ట్ర గవర్నర్ గా కూడా పంపించారు. అంతేకాకుండా ఆయన కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. అలాగే పార్టీ పదవుల్లో కూడా కీ రోల్ పోషించారు. అలాంటి వ్యక్తి పార్టీ వీడుతారని ప్రచారం సాగుతోంది. దీనిపై ఆ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే స్పందించారు.

ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరబోతుండటాన్ని లోక్ సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తప్పుబట్టారు. ఆయన తీసుకున్న నిర్ణయం తమను ఎంతో వేదనకు గురిచేస్తోందని అన్నారు. అంతేకాకుండా ఆయన చాలా పెద్ద తప్పు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు అన్నీ ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని పదవులు, గౌరవాలు పొందిన అతి కొద్ది మంది నేతల్లో ఎస్ఎం కృష్ణ ఒకరని అన్నారు. ఆయన జీవితంలో ఇక కొన్ని రోజులే మిగిలి ఉన్నాయని అన్నారు. ఈ వయసులో ఎస్ఎం కృష్ణ ఇప్పటి వరకు తను నమ్మిన సిద్ధాంతాలను ఎందుకు వదులుకంటున్నారో తెలియడం లేదని అన్నారు. గత 50 ఏళ్లుగా ఆయన నమ్మిన సిద్ధాంతాలను ఇప్పుడు ఎందుకు మార్చుకుంటున్నారో అర్ధం కావడం లేదని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →