కేసీఆర్ ది దొంగదీక్ష కాదని నిరూపించగలరా..? కాంగ్రెస్ నేత మల్లు రవి సవాల్..
తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ దీక్ష చేయడం వల్ల తెలంగాణ రాలేదని అన్నారు. వాస్తవానికి కేసీఆర్ దీక్ష ఎలా చేశారో.. ఎలా విరమించారో ప్రజలకు చాలా బాగా తెలుసని అన్నారు. కేసీఆర్ చేసింది దొంగ దీక్ష కాదని టీఆర్ఎస్ నేతలు నిరూపించగలరా అంటూ సవాల్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో జైపాల్ రెడ్డి పాత్ర లేదని అనడంపై ఆయన మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు టీఆర్ఎస్ నేతల అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే జైపాల్ రెడ్డినే సీఎం కేసీఆర్ కలిశారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని గులాబీ నేతలు మర్చిపోయినట్లున్నారని ఎద్దేవ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ నేతలు చేసిన కృషి ప్రజలందరికి తెలుసని అన్నారు. ప్రజలు తెలివైన వారని టీఆర్ ఎస్ నేతలు చెప్పే మాటలు ఎవరూ నమ్మరని అన్నారు. కేసీఆర్ రుణమాఫీ పథకాన్ని వడ్డీ మాఫీ పథకంలా మార్చారని అన్నారు.కేజీ టు పీజీ ఉచిత విద్య హామీ ఏమైందని నిలదీశారు. 2013 చట్టం ప్రకారమే రాష్ట్రంలో ప్రాజెక్టుల కోసం భూసేకరణ జరగాలని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.