ఫిబ్రవరి 1న అమెరికాలోని లాస్ అంజెల్స్ మహాపట్టణంలో దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతం సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో 400 మంది పిల్లలు, 150 కార్యవర్గం, 1200 పైగా ప్రేక్షకులతో 4వ సాంస్కృతికోత్సవం లాంగ్ బీచ్ లోని జోర్డాన్ హైస్కూల్లో అద్వితీయంగా జరిగింది.
చమర్తి రాజు, కొండుభట్ల దీనబాబు, కోట్ని శ్రీరామ్ & జయంతి, వంక రత్నమాల, వేదుల స్నేహ, నరాల నరేంద్ర, మద్దలి కార్తీక్ & మహేశ్వరీ, వల్లి రావు తదితరులతో కూడిన సిలికానాంధ్ర మనబడి నాయకత్వ కార్యవర్గం సిలికాన్ వ్యాలి నుండి ప్రత్యేకంగా విచ్చేయడం కార్యక్రమానికి ఒక కొత్త హంగునిచ్చింది. దక్షిణ కాలిఫోర్నియా సమన్వయకర్త డాంజి తోటపల్లి మాట్లాడుతూ, “2013 లో తెలుగు మాట్లాట అనే క్రొత్త కార్యక్రమం పుట్టింది. తెలుగు మాట్లాట నుంచి ‘తెలుగాట’ పుట్టి, ప్రస్తుతం టీ.వీ.మాధ్యమం ద్వారా వారం వారం ప్రసారమౌతుంది. కాబట్టి 2013 చాలా జయప్రదమైన సంవత్సరంగా చెప్పుకోవాలి”, అని అన్నారు.
మనబడి విద్యార్ధినీ విద్యార్ధులు కిరణ్ సింహాద్రి గారి నాయకత్వంలో కార్యక్రమాలకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. పిల్లలు అష్టావధానం, సంప్రదాయ పెళ్లి వేడుకలు ఇతివృత్తాలుగా రెండు జట్లుగా ఏర్పడి, కార్యక్రమాలను నిర్వహించారు. పూర్తి చంధోబద్ధమయిన పద్యాలతో సమకూర్చిన అష్టావధానం, తెలుగు భాషా ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంది. అలాగే మరో జట్టు, బొమ్మల పెళ్లిని చూపుతూ చిన్ని చిన్ని సరదా పాటలతో ఒక సంప్రదాయ పెళ్లి వేడుకలోని ఘట్టాలను ప్రదర్శించిన తీరు, సభికులను విశేషంగా ఆకట్టుకుంది.
కార్యక్రమంలో బాలల పాటలు, పద్యాలూ, నాటికలు, నృత్యాలతో కూడిన 40 ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. నాలుగేళ్ల బాలబడి పిల్లలు చిట్టిచిట్టి గొంతులతో ముద్దు ముద్దు మాటలతో తెలుగుపై వారి ప్రావీణ్యత ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. దక్షిణ కాలిఫోర్నియలో గల 14 మనబడి పాటశాలల నుండి ఆరేళ్ళకు పైబడిన ప్రవేశం, ప్రసూనం, ప్రమోదం, ప్రకాశం &ప్రభాసం తరగతుల విద్యార్థులు ప్రదర్శించిన భాష ప్రావీణ్యం ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేసింది. అక్షరమాలలు, బుర్ర కథలు, నీటి కథలు, జంతువుల కథలు, వేమన పద్యాలు &సుమతి శతకాలు, జానపద నృత్యాలు, హాస్యకరమైన నాటికలు, తెలుగు భాష గొప్పతనం చాటి చెప్పే లలితగీతాలును ప్రేక్షకులు కరతాళధ్వనులతో ఆనందించారు. సిలికానాంధ్ర డల్లాస్ సమన్వయకర్త భాస్కర్ రాయవరంచే రచింపబడి శ్రీకాంత కోమటిరెడ్డి ఆధ్వర్యంలో ప్రదర్శింపబడ్డ “వినరా వినరా తెలుగు కథ”, అనే బుర్రకథ ఇర్వైన్ కేంద్రంకి చెందిననేహ మువ్వల, ఇషాన్ కొల్లిపర & శ్రీచరణ్ పామిరెడ్డి ఆలపించిన తీరు సభికులని ఎంతో ఆహ్లాదపరిచింది. అలాగే సంక్రాంతి పండగ గురించి సేర్రిటోస్ కేంద్రం నుంచి పాతిక మంది పిల్లలు కలసి ప్రదర్శించిన నృత్య నాటిక చూసిన సభికులు ప్రదర్సన వారి చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకునేట్టట్టుగా వున్నాయని సమన్వయించిన వెంకట్ ఆలపాటి, మోహన్ & విజయలక్ష్మి కుంతుమళ్ల, మరియు శ్రావని కోడె లను అభినందించారు.
మోహన్ కాట్రగడ్డ, కాంతి దర్భల, భాస్కర్ ఉండి, చక్రి బడబాగ్ని, ప్రశాంత్ తల్లాప్రగడ, సురేష్ చిలుకూరి, సురేష్ అంబాటి, సురేష్ బాబు ఐనంపూడి, సూర్య గంగిరెడ్డి, జవహర్ కంభంపాటి, నరేంద్ర కవర్తపు, సుధా దావులురి, వసంత్ తట్ట, సిద్దు యాదళ్ల, ప్రసాద్ రాణి, కిరణ్ సింహాద్రి మరియు శ్రీనివాస్ యార్లగడ్డ నాయకత్వం వహిస్తున్న 14 మనబడి కేంద్రాలకు చెందిన పిల్లలు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.
అమెరికాలోని జాతీయ తెలుగు సంస్థలు NATA మరియు NATS ఈ కార్యమానికి ఆర్ధిక సహాయం అందిచారు. NATS సంస్థ మనబడి పిల్లలందరికీ అందమైన జ్ఞాపికలు అందజేశారు. స్థానిక తెలుగు సంస్థలు TASC, LATA, IYANA, ట్రైవ్యాలి తమ సమర్థననిచ్చారు. కార్యక్రామానికి రెండు పూటలా భోజనం దోస ప్లేస్ వారి సౌజన్యంతో అమర్చబడినది. కార్యక్రమంలో విన్నుత్నంగా ప్రేక్షకులకు భాగ్యలక్ష్మిలాటరి పద్దతిలో రకరకాల బహుమతులు ఇవ్వబడ్డాయి.
కార్యక్రమానికి మోహన్ కాట్రగడ్డ సారధ్యం వహించగా, సురేష్ బాబు ఐనంపూడి, నరేంద్ర కవర్తపు, కిరణ్ సింహాద్రి, సురేష్ చిలుకూరి, పార్ధ అకలంకంలతో కూడిన బృందం కార్యక్రమ సఫలతకు ఎంతో దోహదం చేసారు.
View full gallery here
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.