పాదయాత్రలు చేసేస్తే సీఎం అయిపోరు: మంత్రి అయ్యన్న పాత్రుడు
పాదయాత్రలు చేసేస్తే సీఎం అయిపోరని మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. కనీసం బుర్ర ఉన్నోడు ఎవడు కూడా మేనిఫెస్టో చెప్పుకుని తర్వాత పాదయాత్రను ప్రకటిస్తారా అంటూ విమర్శించారు. జగన్ కు ఏం అర్హత ఉందని ప్రజలు ఆయనను సీఎంగా ఎన్నుకుంటారని ప్రశ్నించారు. డబ్బులిచ్చి సలహాదారులను పెట్టుకున్న జగన్ కు చంద్రబాబును విమర్శించే అర్హత ఉందా? అని అడిగారు.
జగన్, ఎమ్మెల్యే రోజాలకు రాజకీయాల పట్ల కనీస అవగాహన కూడా లేదన్నారు. భూ అవకతవకల విషయంలో సిట్ నుంచి తనకు లేఖ అందినా పర్వాలేదన్నారు. ఒకవేళ అందినా అందకపోయినా కూడా సహకరిస్తానని చెప్పారు. తాను చేసిన ఆరోపణకు ఆధారాలను అందిస్తానని తెలిపారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.