Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Maria Sharapova failed drugs test at Australian Open

By   /  March 8, 2016  /  Comments Off on Maria Sharapova failed drugs test at Australian Open

    Print       Email

Maria Sharapova 1

చిక్కుల్లో షరపోవా కెరీర్..

InCorpTaxAct
Suvidha

 

ఏకంగా 5 సార్లు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్ సాధించిన రష్యా టెన్నిస్‌ ప్లేయర్‌ మరియా షరపోవా కెరీర్‌ ఇబ్బందుల్లో పడింది. తాను డోపింగ్‌ టెస్ట్‌లో దొరికిపోయినట్లు షరపోవా వెల్లడించారు. జనవరిలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌ సందర్భంగా నిర్వహించిన డ్రగ్‌ టెస్ట్‌లో తాను మెల్డోనియం డ్రగ్‌ తీసుకోవడంతో పాజిటివ్‌ అని వచ్చిందన్నారు. అయితే తాను ఆ డ్రగ్ ను అప్పుడు తీసుకోలేదని చెప్పారు. తాను 2006 నుంచి తీసుకుంటున్నానని తెలిపారు. కాని అప్పట్లో దానిపై నిషేధం లేదన్నారు. ఈ ఏడాదే నిషేధిత జాబితాలో చేర్చారని షరపోవా తెలిపారు.ఇక షరపోవా డ్రగ్ టెస్ట్ లో డోపీగా తేలడంతో అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య ఆమెను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు.. మార్చి 12 నుంచి తాత్కాలిక సస్పెన్షన్‌ అమలులోకి కూడా రానుంది. దీంతో ఆమె కెరీర్ ప్రశ్నార్థకంగా తయారైంది.

‘నేను చాలా పెద్ద తప్పు చేశాను. డోపింగ్‌ టెస్ట్‌ లో విఫలమవ్వడానికి సంబంధించి నాదే పూర్తి బాధ్యత. నా అభిమానులను బాధపెట్టాను, నాలుగేళ్ల వయస్సు నుంచి టెన్నిస్‌ ఆడుతున్నాను.. అందుకే టెన్నిస్‌ అంటే చాలా ఇష్టం’ అని షరపోవా లాస్‌ఏంజిల్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. డోపీగా తేలడం పట్ల ఎదురయ్యే పరిణామాల గురించి తనకు తెలుసు అని చెప్పారు. అయితే తాను కెరీర్‌ ముగించాలని భావించడం లేదన్నారు. తనకు మరో అవకాశం ఇస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. మీడియా సమావేం సందర్భంగా షరపోవా చాలా ఉద్వేగానికి గురయ్యారు.

జనవరి 26న నిర్వహించిన డ్రగ్‌ టెస్ట్‌లో షరపోవా ఫెయిల్‌ అయినట్లు అంతర్జాతీయ టెన్సిస్‌ సమాఖ్య ధ్రువీకరించింది. ఈ విషయాన్ని మార్చి 2న షరపోవాకు తెలిపినట్లు సమాఖ్య తెలిపింది. డ్రగ్స్‌ తీసుకున్నట్లుగా తేలినందున నాలుగేళ్ల వరకు నిషేధం విధించే అవకాశం ఉంది. అయితే శిక్ష తగ్గించే అవకాశం కూడా ఉంటుందని షరపోవా తరఫు న్యాయవాది జాన్‌ హగ్గెర్టీ భావిస్తున్నారు. దానికిగాను ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →