ఇద్దరి చంద్రులపై మత్తయ్య సంచలన వ్యాఖ్యలు
జెరుసలేం మత్తయ్య… రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఓటుకు నోటు కేసులో వెలుగులోకి వచ్చిన మత్తయ్య ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న మత్తయ్య ఏపీ సీఎం చంద్రబాబుపై సంచనల వ్యాఖ్యలు చేశారు. తనకు ఏదైనా జరిగితే ప్రధాన కారకుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే రెండో వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇప్పటికి వరకు నోరు విప్పని మత్తయ్య గళం విప్పడంతో తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్న ఇద్దరి చంద్రుల్లో టెన్షన్ మొదలైంది. ఇదిలా ఉంటే చంద్రబాబు తనను అవసరానికి వాడుకున్నారని, ‘‘నీకేం కాదు.. నేను ఉన్నాను’’ అని చంద్రబాబు తనతో చెప్పారని.. ఇప్పుడు పట్టించుకోవటం లేదన్నారు. ఓటుకు నోటుకేసులో తాను అమాయకుడిగా అభివర్ణించుకున్నారు. తెలుగుదేశం.. టీఆర్ ఎస్ లు.. ఏపీ.. తెలంగాణ ప్రభుత్వాల మధ్య నడుస్తున్న రాజకీయ చదరంగంలో తనను పావును చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన మత్తయ్య.. తనను ఇరువురు బలిపశువును చేశారన్నారు.
ఇద్దరు చంద్రుళ్లు రాజకీయాలకే పరిమితం కాకకుండా తనలాంటి సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్నారన్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం తనను ముద్దాయిని చేసే ప్రయత్నం చేస్తోందని, చంద్రబాబు ఏం కాదంటూ తనకు ధైర్యం చెప్పారని.. ఇద్దరూ కలిసి తన పరిస్థితి అగమ్యగోచరంగా మార్చారన్నారు. కేసీఆర్.. చంద్రబాబులకు భయపడి తాను ఢిల్లీలో ఉన్నట్లు చెప్పిన మత్తయ్య.. జాతీయమానవ హక్కుల కమిషన్ లో పిటీషన్ వేసినట్లు చెప్పుకొచ్చారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.