Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

McCullum Scores Fastest Hundred

By   /  February 20, 2016  /  Comments Off on McCullum Scores Fastest Hundred

    Print       Email

మెక్‌కలమ్‌ సరికొత్త రికార్డు..! 

McCullum scores fastest hundred in Test history1న్యూజిలాండ్‌ కెప్టెన్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ (54 బంతుల్లో) సాధించాడు. ఇప్పటి వరకు సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌, మిస్బాఉల్‌హాక్‌ పేరుతో ఉన్న రికార్డును చెరిపేసి తన పేరున రాసుకున్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య శనివారం క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరిగిన సెకెండ్ టెస్ట్ లో మెక్‌కలమ్‌ ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 74/4 స్కోరుతో కష్టాల్లో ఉండగా మెక్‌కలమ్‌ తన సహచర ఆటగాడు కొరే ఆండర్సన్‌తో కలిసి 110 బంతుల్లో 179 పరుగులు చేశాడు.

InCorpTaxAct
Suvidha

 

1986లో ఆంటిగా వేదికగా ఇంగ్లాండ్‌ జట్టుపై అప్పటి వెస్టిండీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ 56 బంతుల్లో 100 పరుగులు చేశాడు.ఆ తర్వాత 28 ఏళ్లకు 2014లో అబుదాబి వేదికగా ఆస్ట్రేలియాపై పాకిస్థాన్‌ ఆటగాడు మిస్బాఉల్‌హాక్‌ 56 బంతుల్లో సెంచరీ చేసి రిచర్డ్స్‌ రికార్డును సమం చేశాడు. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన సెకెండ్ టెస్ట్ లో మెక్‌కలమ్‌… 54 బంతుల్లోనే 100 పరుగులు చేసి రికార్డు సాధించాడు.

 

కెరీర్‌లో 101వ టెస్టు ఆడుతున్న మెక్‌కలమ్‌ ఇదే మ్యాచ్‌లో మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. టెస్టు చరిత్రలో అత్యధిక సిక్సులు (106) సాధించిన‌ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. మెక్‌కలమ్‌ వీర విహారంతో న్యూజిలాండ్‌ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 370 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే.. మెక్ కలమ్ కెరీర్ లో ఈ మ్యాచ్ ఆఖరిది. మ్యాచ్‌ ముగిసిన వెంటనే మెక్‌కలమ్‌ అంతర్జాతీయ మ్యాచ్‌లకు గుడ్ బై చెప్పనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆఖరి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →