Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Media Sensational News For Pawan Son Name

By   /  October 12, 2017  /  Comments Off on Media Sensational News For Pawan Son Name

    Print       Email

లేటెస్ట్ ట్రెండింగ్.. పవన్ కొడుకు పేరేంటి..!

 

EIS
EnGeniusInc

 

 

సౌత్ లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా వసూళ్లు ఉంటాయి. ఇక కొత్త సినిమా వచ్చిందంటే ఇక దుమ్ముదులిపేసినట్టే. కేవలం హీరోగానే కాదు రాజకీయంగా కూడా జనసేన పార్టీతో జనం కోసం ప్రశించడానికి వచ్చాడు పవన్ కళ్యాణ్. తన గురించి ఎలాంటి న్యూస్ అయినా సరే న్యూసెన్స్ చేసేందుకు మీడియా ముందుంటుంది. పవన్ గురించి కామెంట్ చేసి మరి మైలేజ్ సాధిస్తారని కొందరి మీద వార్తలు వచ్చాయి.

ఇదిలాఉంటే పవన్ వార్త ఏదైనా మీడియాకు దొరికిందే అదునుగా హడావిడి చేస్తుంది. నిన్న తనయుడు పుట్టిన సంతోషంలో పవన్ ఉండగా మీడియా మాత్రం అతని పేరేంటి.. అతనికి హిందూ పేరు పెడతారా లేక క్రిస్టియన్ పేరు పెడతారా అని రచ్చ రచ్చ చేశారు. పవన్ కళ్యాణ్ కొడుకుగా ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టాడో లేదో అతని పేరు మీద రకరకాల వార్తలు రాశారు. మరి సెలబ్రిటీస్ పర్సనల్ విషయాల పట్ల మీడియా చూపిస్తున్న ఈ అత్యుత్సాహం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆలోచించాలి. అతని కొడుక్కి పవన్ ఏం పేరు పెడితే ఏంటి.. అది ఓ న్యూస్ కాదు కచ్చితంగా న్యూసెన్సే.. వార్తలు ఏమి లేవని ఉన్న వార్తనే నానా రచ్చ చేయడం నేటి జర్నలిజం లో భాగమైంది. మరి ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో దేవుడికే తెలియాలి.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct
    Print       Email

You might also like...

Investigation starts on 25th for Jayalalitha’s mysterious death.

Read More →